ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ రూ.20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ మూడో దశ ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి శుక్రవారం సాయంత్రం వివరాలు వెల్లడించారు.

మూడో ప్యాకేజీ వివరాలు :

వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్యాకేజీ ప్రకటన
మూడో ప్యాకేజీలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత
11 అంశాలపై ప్రత్యేక దృష్టి
మత్స్య, పశు సంవర్ధక, డైయిరీ,ఫుడ్‌ ప్రాసెసింగ్‌లపై ప్రత్యేక దృష్టి
వ్యవసాయ రంగానికి రూ. లక్ష కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ
కోల్డ్‌ స్టోరేజ్‌లు, ధాన్యం గిడ్డంగుల నిర్మాణం
రైతుల నుంచి రూ. 74,300 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు
రైతుల ఖాతాల్లో రూ.18,700 కోట్ల నగదు బదిలీలు
డెయిరీ రైతులకు రూ. 5వేల కోట్ల సాయం
రూ. 30వేల కోట్ల మందికి రైతులకు మేలు
ఆక్వా రైతుల ఎగుమతుల కోసం ప్రత్యేక కార్యాచరణ
రూ. 10వేల కోట్లతో స్థానిక ఉత్పత్తుల ఎగుమతి కోసం ప్రత్యేక ప్యాకేజీ
మత్స్య అనుబంధ రంగాలకు రూ. 20వేల కోట్లు
త్వరలో 2 లక్షల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు
ఆక్వా కల్చర్‌కు రూ. 11వేలకోట్ల ప్యాకేజీ
ప్రధాని మత్స్య సంపద యోజన కింద రూ. 20వేల కోట్లతో నిధి
మత్స్యకారులకు బీమా సదుపాయం
పశుసంవర్ధక మౌలిక వసతుల కల్పనకు రూ.15వేల కోట్లు
పశువుల వ్యాక్సిన్స్‌ల కోసం రూ.13,300 కోట్లు
ఔషధ మొక్కలు సాగు చేసేందుకు రూ. 4వేల కోట్లతో నిధి
తేనెటీగల పెంపకందారులకు రూ.5వేల కోట్లు

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *