పూరి "ఫైటర్" ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!
By Newsmeter.Network
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ఫైటర్. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ మూవీని పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ముందుగా తెలుగులోనే చేయాలి అనుకున్నారు ఆతర్వాత పాన్ ఇండియా మూవీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందట. అంతే.. ఆ ఆలోచనను విజయ్ కి చెప్పడం.. ఆయన కూడా ఓకే అనడం వెంటనే వర్క్ స్టార్ట్ చేయడం అంతా.. చాలా స్పీడుగా జరిగింది.
తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ ఫైటర్ ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు పూరి టీమ్ హైదరాబాద్ నుంచి ముంబాయికి షిప్ట్ అయ్యారు. ఆర్నేళ్ల పాటు ముంబాయిలోనే వర్క్ చేసేలా అన్ని ఏర్పాట్లు చేసారు. ఇక ఈ సినిమా షూటింగ్ చాలా వరకు ముంబాయిలోనే చేయనున్నారు. ఆతర్వాత యు.ఎస్ లో మరో షెడ్యూల్ చేయనున్నారు.
కథ విషయానికి వస్తే... ఇందులో విజయ్ నటన ఓసారి నవ్విస్తూ.. మరోసారి ఏడిపిస్తూ.. ప్రేక్షకుల మనసులను దోచుకునేలా ఉంటుందట. ఇంకా చెప్పాలంటే... సినిమా అద్భుతం అనేలా... విజయ్ దేవరకొండ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని సినిమాగా ఫైటర్ నిలుస్తుందని టీమ్ ఫుల్ కాన్పిడెన్స్ తో ఉన్నారు. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియచేస్తూ త్వరలోనే అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం.