రాజస్థాన్‌లో భారీ ప్రమాదం తప్పింది. సిరోహిలో డ్రైనేజీ కాలువపై నిర్మించిన ఫుట్‌పాత్‌ ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలపాలైన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. గత నెలలో కూడా ముంబైలోని లోక్‌మాన్య తిలక్‌ రెడ్డు వద్ద నాలుగ అంతస్తుల భవనం కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం తప్పింది. దీనికి సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.