క‌రోనా వైర‌స్(కొవిడ్‌-19)ను వ్యాప్తిని నియంత్రించేందుకు ఇప్ప‌టికే కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ఈ మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇళ్లకే ప‌రిమితం అయ్యారు. కొంద‌రు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆనందంగ‌డా కాలం గ‌డుపుతుంటే.. మరికొందరు పిల్లలతో, పెద్దవారితో గడిపేందుకు సమయం వచ్చిందని ఆనంద పడుతున్నారు.

కాగా.. లాక్‌డౌన్ కార‌ణంగా.. ఓ వ్య‌క్తికి ఓ పెద్ద త‌ల‌నొప్పి వ‌చ్చిప‌డింది. వెంట‌నే మంత్రి కేటీఆర్ కు త‌న స‌మ‌స్య‌ను ట్వీట్ చేశాడు. లాక్ డౌన్ వల్ల ఇంటి దగ్గర పెళ్లాంతో చస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు. వెంట‌నే స్పందించిన కేటీఆర్ త‌న‌దైన శైలిలో స‌మాధాన మిచ్చారు.

‘కేటీఆర్ అన్నా, ఇంటి దగ్గర పెళ్లాంతో చస్తున్నా. నా రిక్వెస్ట్ ఏంటంటే, టీవీ చానల్ వాళ్లను కొంచెం మంచి సినిమాలు వేయమని చెప్పు. లేకపోతే నాకు ఒకే దారి ఉంది. కాబట్టి, ప్లీజ్.’ అంటూ ట్వీట్ చేశాడు. ‘మీ ఆవిడ ట్విట్టర్‌లో లేదనుకుంటున్నా. (నీ మంచి కోసం)’ అని కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్లు వైర‌ల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో 59 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. వీటిలో ఈ రోజే 10పైగా కేసులు న‌మోదు కావ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. దీంతో ఏప్రిల్ 15 వ‌ర‌కు తెలంగాణ‌లో లాక్‌డౌన్‌ను పొడిగించారు.


వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.