ఐపీఎల్ చరిత్రలోనే ‘ఫాస్టెస్ట్’ బంతిని విసిరాడు.. ఎంత స్పీడు అంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Oct 2020 5:16 PM ISTఐపీఎల్-2020లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అన్‌రిచ్ నోర్జే ఫాస్టెస్ట్ డెలివరీతో రికార్డు సాధించాడు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో నోర్జే ఏకంగా 156. 22కి.మీ వేగంతో బంతిని సంధించాడు. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే వేగవంతమైన డెలివరీ నమోదు చేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
అంతకుముందు ఐపీఎల్‌లో ఈ రికార్డు 154.40 దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ డేల్ స్టేయిన్ పేరిట ఉంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో నోర్జే వేసిన బంతితో ఆ రికార్డు బ్రేక్ అయ్యింది. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో భాగంగా నోర్జే వేసిన మూడో ఓవర్ ఐదో బంతికి ఈ రికార్డును సాధించాడు. నోర్జే వేసిన ఆ బంతిని బట్లర్ ఎదుర్కొన్నాడు. అనంతరం తదుపరి బంతిని కూడా 155.1 కి.మీ వేగంతో సంధించాడు. ఆ బంతికి బట్లర్ బౌల్డ్ అయ్యాడు.
ఇదిలావుంటే.. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 161 పరుగుల స్కోరు చేయగా.. రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో అన్‌రిచ్ నోర్జే రెండు వికెట్లు సాధించాడు.