మ‌నుషులు వ‌దిలే గ్యాస్ ద్వారా కూడా క‌రోనా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Jun 2020 3:29 PM GMT
మ‌నుషులు వ‌దిలే గ్యాస్ ద్వారా కూడా క‌రోనా..!

క‌రోనా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి. దాదాపు మూడున్న‌ర నెల‌లుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ మాయ‌దారి రోగంపై ప‌రిశోద‌న‌ల ద్వారా రోజుకో ఇంట్ర‌స్టింగ్ విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంది. ఈ మ‌హ‌మ్మారి క‌ళ్లు, ముక్కు, నోరు ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని వైద్యులు ఇప్ప‌టికే వెల్ల‌డించారు.

డాక్ట‌ర్ల‌, ప‌రిశోద‌కుల సూచ‌న మేర‌కు దీనిని నియంత్రించేందుకు మాస్కులు ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం, చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కోవ‌డం చేస్తూనే ఉన్నాం. కానీ తాజాగా బ‌య‌ట‌ప‌డిన విష‌య‌మేమిటంటే.. మ‌నుషులు వ‌దిలే గ్యాస్ వ‌ల్ల కూడా వైర‌స్ వ్యాప్తి చెందే అవ‌కాశం ఉందంటున్నారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్త‌లు. అయితే దుస్తులు ధ‌రించి లేన‌ప్పుడే ఈ ముప్పు ఎక్కువ‌గా ఉందంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు.

ఆస్ట్రేలియా వైద్యుడు ఆండ్రీ టాగ్ మాట్లాడుతూ.. అవ‌సాన వాయువుల వ‌ల్ల వైర‌స్ సోకే అవ‌కాశం ఉన్నందున బ‌హిరంగ ప్ర‌దేశాల్లో గ్యాస్ వ‌ద‌ల‌కండని ‌చెబుతున్నారు. అయితే.. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో దీన్ని గుర్తుప‌ట్టి భౌతిక దూరం పాటించడం క‌ష్ట‌మేనంటున్నారు ప్ర‌జ‌లు. ఇదిలావుంటే.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 70 లక్షలు దాటగా.. 4 లక్షల మరణాలు సంభవించాయి. భార‌త్‌లో కేసుల సంఖ్య 2,76, 583కు చేరుకోగా.. 1,35,206 మంది కోలుకున్నారు. 7745 మంది మృత్యువాత ప‌డ్డారు.

Next Story