మహారాష్ట్ర సీఎం సీటు కీచులాటపై రైతు లేఖ..!
By న్యూస్‌మీటర్ తెలుగు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం గడిచిన.. ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. మరోవైపు బీజేపీ-శివసేనల మధ్య మాటల యుద్ధంతో రాజకీయ చిచ్చు రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే బీద్‌జిల్లా కేజ్ తాలూకా వాద్మౌలీ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ విష్ణు గడాలే అనే రైతు జిల్లా కలెక్టర్‌కు లేక రాశారు. బీజేపీ-శివసేన మధ్య జరుగుతున్న మాటల యుద్ధం సద్దుమణిగే వరకు తనను సీఎంను చేయాలన్నది దాని సారాంశం.
లేఖలో ఉంది ఇదే..
రాష్ట్రంలో 'బీజేపీ-శివసేనల మధ్య వివాదం ఇప్పుడప్పుడే తిరేలా లేదు. వారి గొడవ సద్దుమణిగే వరకు నన్ను సీఎంను చేయండి. అందుకు నేను ఆసక్తిగా ఉన్నాను. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పంటలన్నీ నాశనమయ్యాయి. వీటివల్ల రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీని ద్వారా ఎంతో నష్టం వచ్చింది. ఓ వైపు రైతులు ప్రజలు అల్లాడిపోతుంటే..బీజేపీ-శివసేన అధికారం కోసం కొట్టుకుంకోవడం ఏంటి..? ఈ వివాదం సద్దుమణిగే వరకు రాష్ట్రానికి గవర్నర్ బాధ్యత వహించాలి. నా అభ్యర్థను పట్టించుకోకుంటే నేను నిరసన చేపడతాను' అంటూ ఆ రైతు ఆ లేఖలో హెచ్చరించాడు.