బోయిన్‌ పల్లి మార్కెట్‌ యార్డులో రైతు ఆత్మహత్యాయత్నం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2019 11:30 AM GMT
బోయిన్‌ పల్లి మార్కెట్‌ యార్డులో రైతు ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని బోయిన్‌ పల్లి కూరగాయల మార్కెట్ యార్డు వద్ద రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటన సందర్భంగా రైతులు ఆందోళనకు దిగారు. కూరగాయల బస్తా 80నుంచి60 కిలోలకు తగ్గించాలంటూ హమాలీలు డిమాండ్‌ చేసిన నేపథ్యంలో మార్కెట్‌ కమిటీ కార్యాలయం ముందు రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో వికారాబాద్‌ జిల్లా రేగడి మామిడిపల్లికి చెందిన గోవర్థన్‌రెడ్డి ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే తోటి రైతుల ఆయనను రక్షించారు.

అయితే ఏ మార్కెట్‌ యార్డులోనూ లేని విధంగా బస్తా బరువులపై హమాలీలు వివాదం సృష్టించడం మంచిది కాదని రైతులు తెలిపారు. గతంలోనూ ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లామని..తప్పనిసరి పరిస్థితిల్లోనే ఆందోళనకు దిగినట్లుగా రైతులు తెలిపారు. రైతుల ఆందోళన నేపథ్యంలో మంత్రి నిరంజన్‌రెడ్డి అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం రైతుల వద్దకు వచ్చి..వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. దింతో రైతులు ఆందోళన విరమించారు.

Next Story
Share it