ప్రముఖ క్యారెక్టర్‌ నటి సన తెలుగు, తమిళంలో దాదాపు 600 సినిమాలకు పైగా నటించిన సంగతి తెలిసిందే. సినిమాల్లోనే కాకుండా టీవీ ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలే.

0eeb49bc 9125 49f0 8022 226b79c32e92

మంగళవారం సన, ఆమె భర్త సయ్యద్‌ సదుద్దీన్‌ మాట్లాడుతూ… మా అబ్బాయి సయ్యద్‌ అన్వర్‌ వివాహం సమీరా షెరీఫ్‌తో ఈ రోజు పెద్దల సమక్షంలో జరిగింది. మా అబ్బాయి పలు తమిళ సీరియల్స్‌లో హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా చాలా ఫేమస్‌. అలాగే మా కోడలు సమీరా షెరీఫ్‌ కూడా తెలుగు, తమిళ టీవీ రంగాల్లో బుల్లితెరపై సంచలనం సృష్టించిన అనేక సీరియల్స్‌లో హీరోయిన్‌గా చేసిందని చెప్పారు.

Fdb6c2d5 D57d 4eaa Ad31 76c9098b65c0

వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఇన్‌స్టాలో ‘అన్విరా’ హ్యాండిల్‌తో పోస్టులు పెడుతుంటారు. ఈ పోస్ట్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేమస్‌. సోమవారం రాత్రి వీరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రశాంతంగా జరిగింది.

E56d0f8a 831e 43b4 Bbc0 Ff0fe8654e36

ఇద్దరూ కలిసి కొంతమంది పేద విద్యార్థులను దత్తత తీసుకొని వారి చదువుకయ్యే ఖర్చులకు సహాయపడాలనుకుంటున్నారు. వారిద్దరి నిఖా జరిగిందని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మేం ఈ విషయాన్ని పత్రికా ముఖంగా తెలియజేశామన్నారు.

C046c638 Ebef 4aac 8056 35b032a9405f

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.