లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: బావిలో దూకి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

By సుభాష్  Published on  21 May 2020 2:59 PM GMT
లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: బావిలో దూకి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

కరోనా మహమ్మారి అందరి బతుకులను దారుణంగా మార్చేస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా వలస కూలీల పరిస్థితి అంతా ఇంతా కాదు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వలస వచ్చిన పశ్చిమబెంగాల్‌కు చెందిన వలస కూలీ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బావిలో దూరం ఈ దారుణానికి పాల్పడ్డారు. గీసుకొండ మండలం గొర్రెకుంటలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు వలస వచ్చారు. స్థానికంగా ఓ పప్పుమిల్లులో పనులు చేసుకుంటూ బతుకు వెళ్లదీస్తున్నారు. అయితే గురువారం ఇండస్ట్రియల్‌ ప్రాంతంలో ఓ బావిలో నలుగురు శవాలై కనిపించారు. గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసలు వివరాలు సేకరించారు. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారని, స్వస్థలానికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపింది. అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it