సోషల్ మీడియా సంగతి అందరికీ తెలిసిందే. మంచిగా వాడుకుంటే అంతులేని విజ్ఞానం. వాడుకోపోతే..పుకార్ల షికార్లకు వేదిక. నవంబర్8, 2018న కేంద్రం పెద్ద కరెన్సీ నోట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ కొత్గా రూ.2000 నోట్లు, రూ.500 నోట్లు తీసుకొచ్చింది. పాత రూ.100, రూ.50, రూ.10 నోట్లు మాత్రం కొనసాగాయి. అయితే…అవి ఉంటూనే కొత్తవి వచ్చాయి. అందేకాదు..రూ.200 నోట్ కొత్తగా తీసుకొచ్చింది ఆర్‌బీఐ. మరో పక్క రూ.2000 నోట్ ముద్రణ ఆపేశారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు..ఎస్‌బీఐని ఏటీఎంల్లో రూ.2000 నోట్లు పెట్టొద్దని ఆర్బీఐ ఆర్డర్ వేసిందని కూడా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆర్‌బీఐ రూ.1000 నోట్‌ను మార్కెట్‌లోకి తీసుకు వస్తుందా?.అనేది లక్ష డాలర్ల ప్రశ్న. అయితే..పుకార్లకు తగ్గట్లుగానే సోషల్ మీడియాలో రూ.1000 నోట్ షికారు చేస్తుంది. అంతేకాదు బాగా వైరల్ కూడా అయింది.ఈ నోట్‌పై ఇప్పటి వరకు ఆర్‌బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆర్‌బీఐ ముద్రించే నోటు మీద గవర్నర్ సంతకం ఉంటుంది..దీనిపై మహాత్మ గాంధీ సంతకం ఉండటంతో ఇది ఫేక్ నోట్ అని అందరూ భావిస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.