నిజ నిర్ధారణ: పోలీసులు యూనివర్సిటిలోకి వెళ్లకూడదనే చట్టం ఉందా??

By అంజి  Published on  19 Dec 2019 8:17 AM GMT
నిజ నిర్ధారణ: పోలీసులు యూనివర్సిటిలోకి వెళ్లకూడదనే చట్టం ఉందా??

హైదరాబాద్: ట్విట్టర్‌లో ప్రసిద్ధ స్క్రిప్ట్ రైటర్, లిరిసిస్ట్, మాజీ ఎంపి జావెద్ అక్తర్ ఢిల్లీ పోలీసులు జామియా విశ్వవిద్యాలయంలోకి చొరబడడాన్ని తప్పుపడుతూ ట్వీట్ చేశారు. "లా ఆఫ్ లాండ్ ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లో పొలీసులు ఏ యూనివర్సిటీ ప్రాంగణంలోకి పర్మిషన్ లేకుండా వెళ్లలేరని, ఇలా చేయడం తప్పు" అని ఆయన ఆ ట్వీట్ లో అన్నారు.



దీనికి ఒక పోలిస్ ఆఫీసర్, సందీప్ మిట్టల్ సమాధానం ఇస్తూ "ఈ లా ఆఫ్ లాండ్ గురించి మరిన్ని వివరాలు తెలపండి, ఏ సెక్షన్ కింద వస్తుంది, ఎక్కడ రాసుంది చెప్పండి" అంటూ ఎద్దేవా చేశారు.

ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే... "పోలీసులు యూనివర్సిటి క్యాంపస్‌లోకి అధికారుల అనుమతి లేకుండా ప్రవేశించకూడదు అనడానికి చట్టం ఉందా? యూనివర్సిటి వంటి ప్రదేశాలు పోలీసుల పరిధిలోకి రావా??

Fact checking

నిజ నిర్ధారణ:

మొదట, న్యూస్ మీటర్ బృందం రెండు ట్విట్టర్ అకౌంట్లూ నిజమైనవే అని నిర్ధారించుకుంది.

అధికారుల ప్రకారం, ఒకవేళ ఏదైనా తప్పు జరుగుతోందని లేదా జరగవచ్చని అనిపించినా పోలీసులు ఎటువంటి ప్రదేశానికైన అనుమతి లేకుండా వెళ్లవచ్చు. చట్టం పరిధిలో ఉంటూ శాంతిని కాపాడడానికి ఏమి చేయాల్సి వచ్చినా వారు చేయవచ్చు. యూనివర్సిటీలు, ప్రార్థన స్థలాలు మినహాయింపు కాదు. యూనివర్సిటి గ్రాంట్స్ కమిషన్ గైడ్ లైన్స్‌లో కూడా పోలీసులు యూనివర్సిటీలోకి రావడంపై ఎటువంటి ఆంక్షలు లేవు.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం పోలీసులు ఎటువంటి వారంట్ లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చు, సీఅర్సీసీ సెక్షన్ 46, పోలీసులను ఎదురించే ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం వారికి ఉంది. సెక్షన్లు 47, 48 అనుమానిత వ్యక్తి వెంటాడుతూ ఏ ప్రదేశానికైనా వెళ్లొచ్చు.

కానీ, సాధారణంగా పోలీసులు యూనివర్సిటీల లోపలికి వెళ్లి విద్యార్ధులకి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకోరు. ఎందుకంటే, అది ఇంకా పెద్ద సమస్యలకు దారి తీయొచ్చు. కానీ, ఒకవేళ వారు యూనివర్సిటి లోకి వెళ్లదళిస్తే మాత్రం, అది చట్ట వ్యతిరేకం కాదు. జామియా యూనివర్సిటీలోకి కొందరు దుండగులు అక్రమంగా చొరబడినందుకు తాము కూడా వెళ్లాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు.

కానీ, పోలీసుల ఈ చర్య వల్ల, ఒక్క జామియా యూనివర్సిటీ విద్యార్ధులే కాదు, దేశంలోని సుమారు 20 యూనివర్సిటీల విద్యార్ధులు నిరసనలు మొదలు పెట్టారు.పోలీసులు యూనివరిసిటీలలోకి వెళ్లకూడదు అనే చట్టం మాత్రం ఎక్కడ లేదు. అవసరం అనిపిస్తే, శాంతి ని కాపాడేందుకు ఎక్కడకైనా వెళ్లే అధికారం వారికి ఉంది.

Next Story