Fact Check : కుంభమేళాలో యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారా..?
Fact check of Yogi Adityanath visit Kumbamela. సాధువులతో కలిసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుణ్య స్నానాలు ఫోటోవైరల్.
By Medi Samrat Published on 25 April 2021 5:13 AM GMT
సాధువులతో కలిసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుణ్య స్నానాలు ఆచరిస్తున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యోగి ఆదిత్యనాథ్ చుట్టూ పలువురు సాధువులు చేరినట్లుగా ఆ ఫోటో ఉంది.
#योगी_आदित्यनाथ हुए #कोरोना पोज़िटिव,
— SARFARAZ CHOUDHARY (@sarfaraz5502) April 15, 2021
ये कौनसी #जमात में जाकर आये थे!#पूछता_है_भारत 😂#KumbhCorona #KumbhMela #YogiAdityanath pic.twitter.com/XL6AZXnoi0
ఇటీవల ఉత్తరాఖండ్ లో నిర్వహించిన కుంభమేళాలో ఈ ఘటన చోటు చేసుకుందని పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ఇక్కడికి వెళ్లిన తర్వాతనే యోగి ఆదిత్యనాథ్ కు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.
#योगी_आदित्यनाथ हुए #कोरोना पोज़िटिव,
— Md Arif (@MdArif22619019) April 15, 2021
ये कौनसी #जमात में जाकर आये थे!#पूछता_है_भारत 😂 pic.twitter.com/FtFadSeNpy
ఈ ఏడాది ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో నిర్వహించిన కుంభమేళా కరోనా మహమ్మారికి హాట్ స్పాట్ గా మారిందంటూ పలువురు విమర్శించిన సంగతి తెలిసిందే..! కుంభమేళా నిర్వాహకులతో నరేంద్ర మోదీ కూడా మాట్లాడారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 2021లో చోటు చేసుకున్న కుంభమేళాకు, దీనికి ఎటువంటి సంబంధం లేదని తెలిసింది.
అంతేకాకుండా Deccan Herald కథనం ప్రకారం ఈ ఫోటో 2019 సంవత్సరంలో ప్రయాగ్ రాజ్ లో నిర్వహించిన కుంభమేళాకు చెందినదని తేలింది. వెబ్ సైట్ లో అందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది.
ఈ ఫోటోలను సెర్చ్ చేయగా ఆన్ లైన్ లో పలు మీడియా సంస్థల వద్ద ఈ ఫోటోలు ఉన్నాయి. సదరు మీడియా సంస్థలు 2019లో నిర్వహించిన మేళాకు సంబంధించిన ఫోటోలుగా తెలియజేశాయి.
యోగి ఆదిత్యనాథ్ అప్పట్లో ప్రయాగ్ రాజ్ లో క్యాబినెట్ మీటింగ్ ను ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ తర్వాత ఆయన గంగానదిలో పవిత్ర స్నానమాచరించారు. అప్పటి బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా కూడా గంగానదిలో పుణ్యస్నానమాచరించారు.
#WATCH Prayagraj: Uttar Pradesh Chief Minister Yogi Adityanath and other leaders take holy dip at #KumbhaMela2019 pic.twitter.com/srZmBhgh5P
— ANI UP (@ANINewsUP) January 29, 2019
ఇక ఈ ఏడాది కుంభమేళాలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారంటూ ఎలాంటి వార్తా కథనాలు కూడా కనిపించలేదు. యోగి ఆదిత్యనాథ్ పవిత్ర స్నానమాచరిస్తున్న ఈ ఫోటో ఇప్పటిది కాదు.. 2019కి చెందినదని.. వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.