FactCheck : భారత్-ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్ ను మరోసారి నిర్వహించబోతున్నారా?
ICC వరల్డ్ కప్ 2023లో భారత్ ఓటమి తర్వాత.. ఫైనల్ మళ్లీ జరుగుతుందని ఒక వ్యక్తి పేర్కొన్న వీడియో వైరల్ అవుతోంది
By Medi Samrat Published on 24 Nov 2023 9:16 PM ISTICC వరల్డ్ కప్ 2023లో భారత్ ఓటమి తర్వాత.. ఫైనల్ మళ్లీ జరుగుతుందని ఒక వ్యక్తి పేర్కొన్న వీడియో వైరల్ అవుతోంది. స్ప్రింగ్‌లతో ఉన్న బ్యాట్‌లను ఉపయోగించడం వల్ల ఆసీస్ ఆటగాళ్లు పరుగులు చేశారని.. భారత ఆటగాళ్లు పెద్దగా ఆడకపోవడానికి.. ఆసీస్ ఆటగాళ్లు మంచిగా ఆడడానికి కారణం ఇదేనని చెప్పుకొచ్చాడు.
వైరల్ వీడియోలో “నరేంద్ర మోదీ స్టేడియం నుండి సంచలన వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రపంచ కప్‌ను గెలుచుకున్నప్పటికీ, ఆస్ట్రేలియన్లు స్ప్రింగ్‌తో అమర్చిన బ్యాట్‌లను ఉపయోగిస్తున్నారని తేలినందున ఫైనల్ మ్యాచ్ మళ్లీ నిర్వహించబోతున్నారు. రోహిత్, కోహ్లి వంటి భారత బ్యాటర్లు విఫలమైనా, ఆస్ట్రేలియా బ్యాటర్లు మాత్రం భారత బౌలర్లను చిత్తు చేశారు. దీని కారణంగా, ఆస్ట్రేలియా బ్యాటర్లు స్ప్రింగ్ బ్యాట్‌లను ఉపయోగిస్తున్నారని BCCI అనుమానించింది. దర్యాప్తులో అదే కనుగొన్నారు. జయ్ షా స్క్రిప్ట్‌ను పాటించనందుకు ఆస్ట్రేలియాకు ఐసీసీ జరిమానా విధించింది. ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ ఖరారుపై చర్చ జరుగుతోంది." అంటూ చెప్పుకొచ్చాడు.
ఇన్‌స్టాగ్రామ్ పేజీ, ది ఫాక్సీ స్పోర్ట్స్, “ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ బ్యాట్‌లో స్ప్రింగ్ దొరికింది, ప్రపంచ కప్ ఫైనల్ మళ్లీ జరుగుతుంది” అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేసింది.
ఆ వీడియోను కొన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ ది ఫాక్సీ ఒక వ్యంగ్య వెబ్ పోర్టల్ అని కనుగొంది. అది నిజం కానివి.. వ్యంగ్యంతో కూడుకున్న కంటెంట్‌ను ప్రచురిస్తుంది
మేము ది ఫాక్సీ స్పోర్ట్స్ కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ పేజీని పరిశీలించాం. అందులో వింత వాదనలు చేస్తూ అనేక వీడియోలను కనుగొన్నాము: సచిన్ టెండూల్కర్ గౌరవార్థం కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహం వాంఖడే స్టేడియం నుండి తొలగించనున్నారు.. ఎందుకంటే ముగ్గురు భారత ఆటగాళ్లు శ్రీలంకపై సెంచరీ చేయడంలో విఫలమయ్యారని అందులో తెలిపారు. రోహిత్ శర్మ స్ప్రింగ్ బ్యాట్ ని తీసుకువచ్చాడు. 2003 ప్రపంచకప్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని అలా చేస్తున్నారు. అంటూ ఏ మాత్రం నిజం లేని వార్తలను ప్రచారం చేశారు ఈ సోషల్ మీడియా అకౌంట్ లో!!
ఇన్‌స్టాగ్రామ్ పేజీ బయోలో “స్పోర్ట్స్ సెటైర్” అని కూడా మేము కనుగొన్నాము. ఇది క్రీడలకు సంబంధించిన వ్యంగ్య కంటెంట్‌ను పోస్ట్ చేస్తుందని నిర్ధారిస్తుంది.
ఇంకా, మేము వీడియోలో అందించిన లింక్‌ని తనిఖీ చేసాము, అది మమ్మల్ని The Fauxy వెబ్‌సైట్‌కి మళ్లించింది.
వెబ్‌సైట్‌లో “ఫాక్సీ అనేది వ్యంగ్య వెబ్ పోర్టల్. ఈ వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన మెటీరియల్ అంతా ఇమాజినేషన్ మీద ఆధారపడింది. ఫాక్సీలోని కథనాలను వాస్తవమైనవిగా పరిగణించవద్దని పాఠకులకు సూచిస్తున్నాం" అని వివరణ ఇచ్చారు.
న్యూస్‌మీటర్, గతంలో, ది ఫాక్సీ ద్వారా వైరల్ అయిన అనేక వ్యంగ్య విషయాలపై ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఇప్పుడు కూడా అలాంటి వాదనతోనే పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు.
Credits : Md Mahfooz Alam