కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో పాకిస్థానీ జెండాలు ఉపయోగించారనే వాదనతో పోస్టులను షేర్ చేస్తూ వస్తున్నారు. ఒక సమూహం బ్యానర్లు, ఆకుపచ్చ జెండాలతో నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది.
బ్యానర్‌లో రాహుల్ గాంధీ పేర, ఫోటో ఉన్నాయి. వీడియోలో భారత్ జోడో యాత్ర నేపథ్య సంగీతం ఉంది.
భారత్ జోడో యాత్రలో ఉపయోగించిన ఆకుపచ్చ జెండా పాకిస్థాన్ జెండా అని పేర్కొంటూ వీడియోను షేర్ చేసిన ఒక వినియోగదారు, "కాంగ్రెస్ పార్టీ మన దేశానికి ప్రమాదకరమని లౌకిక హిందువులకు ఇంతకన్నా ఏమి సాక్ష్యం కావాలి" అని రాశారు. (Archive)
పోస్ట్‌ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
సుదర్శన్ న్యూస్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ సురేశ్ చవాన్కే మతపరమైన కోణంలో వీడియోను పంచుకున్నారు. (Archive)
పోస్ట్‌ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదే క్లెయిమ్‌తో ఫేస్‌బుక్‌లో వీడియో విస్తృతంగా ప్రచారం అవుతోంది. (పోస్ట్‌లను చూడటానికి ఇక్కడ, ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి.)
నిజ నిర్ధారణ:
రాహుల్ గాంధీ పేరు, ఫోటోతో పాటు, బ్యానర్‌పై త్రివర్ణ పతాకం, IUML అని కూడా వ్రాయబడిందని NewsMeter బృందం గమనించింది. మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించామ. IUML అంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళకు చెందిన రాజకీయ పార్టీ, కాంగ్రెస్ నేతృత్వంలోని UDF ఫ్రంట్ కూటమిలో ఒక భాగస్వామి అని గుర్తించాము.
దీన్ని క్లూగా తీసుకుని వీడియో కోసం వెతికితే ఫేస్‌బుక్‌లో ఒరిజినల్ వీడియో కనిపించింది. ఇది సెప్టెంబర్ 26న ముస్లిం యూత్ లీగ్ గురువాయూర్ పేజీలో పోస్ట్ చేయబడింది. రాహుల్ గాంధీకి, భారత్ జోడో యాత్రకు స్వాగతం అంటూ మలయాళంలో క్యాప్షన్ పెట్టారు.
భారత్ జోడో యాత్రలో పాకిస్థాన్ జెండాలు ఉపయోగించబడ్డాయో లేదో ధృవీకరించడానికి, మేము వైరల్ వీడియోలోని జెండాలను పాకిస్థాన్ జాతీయ జెండాతో పోల్చాము. పాకిస్తాన్ జాతీయ జెండా నిలువుగా తెల్లటి స్ట్రిప్‌ను కలిగి ఉంది. చంద్రవంక మరియు నక్షత్రం జెండా మధ్యలో ఉన్నాయి. వైరల్ వీడియోలోని జెండాలకు తెల్లటి గీత లేదు. నెలవంక, నక్షత్రం జెండా మూలలో ఉన్నాయి. వైరల్ వీడియోలో కనిపిస్తున్న జెండాలు IUMLకి చెందినవి. రెండు జెండాలకు ఉన్న తేడాలను మీరు ఇక్కడ గమనించవచ్చు.
వైరల్ వీడియోలోని జెండా పాకిస్థాన్‌కు చెందినది కాదని, IUMLకి చెందినదని స్పష్టంగా తెలుస్తోంది.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.