జనవరి 24, 2024న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించారు. భారీ ఎత్తున విరాళాలు వస్తున్నాయి. హుండీల నుండి భారీగా డబ్బును తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
“మొదటి రోజు డొనేషన్ బాక్స్‌లో చాలా డబ్బు విరాళంగా వచ్చింది, సగం రోజులో డొనేషన్ బాక్స్ నిండిపోయింది. రామ మందిరం అయోధ్యలో మొదటి రెండు రోజుల్లో రూ. 3.17 కోట్ల విరాళం” అని వీడియోను షేర్ చేస్తూ ఒక ట్విట్టర్ వినియోగదారు రాశారు.
"రామ మందిరానికి విరాళంగా ఇచ్చిన డబ్బు" అని వీడియోను పంచుకుంటూ మరొక వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం ముగిసిన తరువాత, ప్రజల కోసం తలుపులు తెరిచారు. లక్షల్లో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తూ ఉన్నారు. సందర్శకులు సౌకర్యవంతంగా రామ్ లల్లాకు ప్రార్థనలు చేసేందుకు వీలుగా క్రౌడ్ మేనేజ్‌మెంట్ సక్రమంగా ఉండేలా చూడాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను కోరారు.
నిజ నిర్ధారణ :
వైరల్ వీడియోలో ఉన్నది.. రాజస్థాన్‌లోని సన్వాలియా సేథ్ మందిర్‌లో వచ్చిన విరాళాలని న్యూస్‌మీటర్ కనుగొంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో, జనవరి 16న పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను మేము కనుగొన్నాము. “ఈసారి రూ. 12 కోట్ల 69 లక్షల నగదు విరాళాలు శ్రీ సన్వాలియా సేథ్ టెంపుల్ కు హుండీ ద్వారా వచ్చాయి.” అని క్యాప్షన్ ఉంది.
ఆ అకౌంట్ ప్రొఫైల్‌ను తనిఖీ చేసినప్పుడు, అది నితిన్ వైష్ణవ్ అనే వ్యక్తి వ్యక్తిగత బ్లాగ్ అని మేము కనుగొన్నాము, అతను తనను తాను సన్వాలియా ఆలయ ప్రధాన పూజారిగా తెలిపారు.
మేము Google మ్యాప్స్‌లో సన్వాలియా ఆలయ చిత్రాల కోసం వెతికాము. వైరల్ వీడియోలోని విజువల్స్‌తో వాటిని పోల్చాము, ఆ వీడియో రాజస్థాన్‌లోని సన్వాలియా దేవాలయానికి చెందినదని నిర్ధారించుకున్నాం.
సంబంధిత కీ వర్డ్స్ ను ఉపయోగించి, మేము సన్వాలియా ఆలయానికి వచ్చిన విరాళాలకు సంబంధించిన వార్తల కోసం వెతికాము. జనవరి 17, 2023న జీ న్యూస్ కు సంబంధించిన నివేదికను చూశాము. ఆ నివేదిక ప్రకారం ప్రకారం, రూ. 12,97,14,476 విరాళాలు వచ్చాయి. లెక్కింపు నాలుగు రోజుల పాటు జరిగింది.
వైరల్ వీడియోకు అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత వచ్చిన విరాళాలకు ఎటువంటి సంబంధం లేదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Credits : Md Mahfooz Alam