కోపంతో ఊగిపోతున్న పెళ్లి కూతురుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. పెళ్లి కొడుకు పీటల మీదనే గుట్కా తింటూ ఉండగా.. ఆమె కోపంతో కొట్టిన ఘటనను వీడియో తీశారని పలువురు వీడియో షేర్ చేయడం మొదలు పెట్టారు.
"Bride Slaps Groom for Chewing Tobacco During Wedding Ceremony, Video goes viral." అంటూ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు.
https://www.facebook.com/watch/?ref=search&v=1703023616754779
https://twitter.com/ENjoydeepLY/status/1432291345331228677
"పెళ్లి పీటలపైనే వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు పెళ్లి పీటలపైనే కాబోయే భర్త చెంప చెళ్ళుమనిపించింది .. ఓ వధువు . పూజారి మంత్రాలు చదివించే సమయంలో వరుడు పొగాకు - గుట్కా నములుతుండటమే అందుకు కారణం . దీనికి అడ్డు చెప్పని పండితుడిని రెండు దెబ్బలేసింది . నోట్లో గుట్కా ఉమ్మివేసే వరకు కోపంతో రగిలిపోయింది . వెంటనే భయంతో పెళ్లి కుమారుడు గుట్కా ఉమ్మివేశాడు." అంటూ తెలుగు మీడియాలో కూడా వార్తలను రాశారు.
https://telugu.samayam.com/latest-news/india-news/angry-bride-slaps-groom-during-wedding-pheras-over-chewing-tobacco/articleshow/85736362.cms
https://www.news18.com/news/buzz/bride-slaps-groom-for-chewing-tobacco-during-wedding-ceremony-video-is-viral-4140302.html
https://www.india.com/viral/viral-video-angry-bride-slaps-groom-for-chewing-tobacco-during-wedding-ceremony-watch-4921759/
Archive links:
https://web.archive.org/web/20210903130137/https://www.facebook.com/login/?next=https%3A%2F%2Fwww.facebook.com%2Fsiddavatam.nagamuni%2Fvideos%2F331992245279102
https://web.archive.org/web/20210903130332/https://twitter.com/ENjoydeepLY/status/1432291345331228677
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న కథనాల్లో 'ఎటువంటి నిజం లేదు'.
వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకోగా ఈ వీడియోను Chandan Mishra అనే యుట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు. ఇది కామెడీ స్కిట్ అని స్పష్టంగా తెలుస్తోంది. బీహార్ రాష్ట్రం లోని మైథిలి భాషలో ఈ కామెడీ స్కిట్ ను చేశారు. మొత్తం 11 నిమిషాల నిడివి ఉన్న కామెడీ స్కిట్ కాగా.. వైరల్ అవుతున్న క్లిప్ ను 7.18 దగ్గర చూడొచ్చు. కామెడీ వీడియోను కాస్తా నిజమైన వీడియో అంటూ షేర్ చేశారు.
https://www.youtube.com/watch?v=WDU2Q-B9blc
వీడియోను ఇటీవల ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్ అయింది.
రామ్ లాల్ కామెడీ మైథిలి భాషలో బాగా పాపులర్.. యూట్యూబ్ లో చాలానే కామెడీ క్లిప్స్ ఉన్నాయి.
https://www.youtube.com/results?search_query=ramlal+comedy+maithili+language
గతంలో తీసిన స్క్రిప్టెడ్ కామెడీ వీడియో కాస్తా.. నిజంగానే ఇటీవల చోటు చేసుకుందనే ప్రచారం సాగుతోంది. కాబట్టి వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.