వరద నీటిలో కొట్టుకుపోతున్న ఐదుగురు వ్యక్తులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో తెలుగు రాష్ట్రాలకు చెందినదిగా ప్రచారం జరుగుతోంది.
'హై అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు' అని క్యాప్షన్ రాసి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
NewsMeter యూట్యూబ్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్, కీవర్డ్ సెర్చ్‌ని నిర్వహించింది.. అది మమ్మల్ని 21 జూలై 2011న అప్‌లోడ్ చేసిన వీడియోకి దారితీసింది. వైరల్ క్లిప్ 0:41 మార్క్ (1:11 వరకు) వద్ద కనిపిస్తుంది. వీడియో వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఆ వీడియో టైటిల్ "Patalpani incident Indoree." అని ఉంది. Wild Films ద్వారా వీడియోను అప్లోడ్ చేశారు. దక్షిణ ఆసియా పర్యాటక విభాగానికి చెందిన YouTube ఛానెల్.
దాన్ని క్లూగా తీసుకుని పాతాళపాణి విషాదం కోసం వెతికితే కొన్ని కథనాలు దొరికాయి. ఒకదాని ప్రకారం, 17 జూలై 2011న, సందర్శకులు మధ్యప్రదేశ్‌లోని "పాతాల్ పానీ" అనే జలపాతం వద్ద ఉండగా, వరదల కారణంగా నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గల్లంతయ్యారు. (Source: NDTV, India TV News, Patrika)
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలలో భారీ వర్షాల కారణంగా ప్రజలు గల్లంతైనట్లు, వరద నీటిలో కొట్టుకుపోయినట్లు పలు వార్తలు వచ్చాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తప్పిపోయిన ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు నిర్ధారించారు. (వీడియో నివేదికను కూడా ఇక్కడ చూడండి.)
వరద నీటిలో కొట్టుకుపోతున్న ప్రజలకు సంబంధించిన వీడియో తెలుగు రాష్ట్రాలలో చోటు చేసుకున్నది అనే వాదన తప్పు. ఈ వీడియో 2011లో మధ్యప్రదేశ్‌లోని " పాతాళపాణి" జలపాతం వద్ద ఐదుగురు అదృశ్యమైన సంఘటనలోనిది.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నదంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.