Fact Check: ఓ వ్యక్తి టీవీ పగలగొడుతున్న వీడియో భారత్-పాక్ T20 ప్రపంచ కప్ మ్యాచ్‌ కి సంబంధించినదా..?

Viral video not linked to recent Indo-Pak T20 world cup match. టీ20 ప్రపంచకప్‌ లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ తర్వాత పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన టెలివిజన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2022 8:57 AM GMT
Fact Check: ఓ వ్యక్తి టీవీ పగలగొడుతున్న వీడియో భారత్-పాక్ T20 ప్రపంచ కప్ మ్యాచ్‌ కి సంబంధించినదా..?

టీ20 ప్రపంచకప్‌ లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ తర్వాత పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన టెలివిజన్ సెట్‌ను ధ్వంసం చేశాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోను క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా పోస్టు చేశాడు.


Nahin yaar, TV ka kya kasoor. అంటూ పాకిస్థాన్ అభిమానులను కవ్వించేలా పోస్టు పెట్టాడు.

నిజ నిర్ధారణ:

NewsMeter బృందం కీవర్డ్ శోధనను అమలు చేసింది, YouTubeలో అదే వీడియోకు సంబంధించి ఎక్కువ నిడివి ఉన్న వీడియోను గుర్తించాం. అసలు వీడియోలో పూర్తిగా భిన్నమైన కథనం ఉంది. "Angry Football Fan Smashes His TV and Laptop, Turkey – Croatia" అంటూ 2016లో వీడియోను అప్లోడ్ చేశారు.

వీడియోను నిశితంగా విశ్లేషించిన తర్వాత, అది పాత వీడియో అని.. క్రికెట్‌కు సంబంధించినది కాదని మేము కనుగొన్నాము. అసలు వీడియోలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఉంది, T20 ప్రపంచ కప్ కాదు. అందుకే, వీడియో మార్చబడింది.

మేము రివర్స్ ఇమేజ్ శోధనను అమలు చేసాము మరియు సంఘటనపై నివేదికను కనుగొన్నాము. "Football-mad fan destroys his own house following girlfriend's cruel Euro 2016 prank," అంటూ నివేదిక ఉంది.

"Turkish football fan Izzet Salti had wanted some peace and quiet when he sat down to watch a long-awaited Euro 2016 game. The man tuned in to watch his country play Croatia in their first game of the competition held in France. But, as the game wore on, Mr Salti became stressed as Turkey failed to make a breakthrough. When his girlfriend asked him a question, he suddenly lost his temper and demanded she leave the room," అంటూ వీడియోకు సంబంధించిన నివేదిక ఉంది. టర్కిష్ ఫుట్‌బాల్ అభిమాని ఇజెట్ సాల్టీ చాలా కాలంగా ఎదురుచూస్తున్న యూరో 2016 గేమ్‌ను చూడటానికి కూర్చున్నప్పుడు.. అతడి గర్ల్ ఫ్రెండ్ టీవీని మొబైల్ ఫోన్ సాయంతో ఆన్, ఆఫ్ చేస్తూ ప్రాంక్ చేయడం మొదలుపెట్టింది. అంతేకాకుండా టర్కీ మ్యాచ్ లో గొప్పగా ఆడకపోవడంతో సాల్టీకి కోపం వచ్చింది.. తన నిగ్రహాన్ని కోల్పోయి.. గర్ల్ ఫ్రెండ్ ను గది నుండి బయటకు వెళ్ళమని కోరాడు. అయితే ఆమె ఈ వీడియోను రికార్డు చేస్తూ.. టీవీని ఆన్ అండ్ ఆఫ్ చేయడం మొదలుపెట్టడంతో సాల్టీ కోపంతో టీవీని పగులగొట్టాడు.

ఈ వీడియో ఇటీవల జరిగిన ఇండో-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు సంబంధించినది కాదని స్పష్టమైంది.

కాబట్టి, వైరల్ అవుతున్న దావా తప్పు.

Claim Review:Man breaking TV after India-Pakistan T20 match.
Claimed By:social media users
Claim Reviewed By:Newsmeter
Claim Source:facebook
Claim Fact Check:False
Next Story