FactCheck : అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా ప్రెగ్నెంట్ అయ్యారంటూ పోస్టులు వైరల్

అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా గర్భవతి అయినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Sep 2023 2:43 PM GMT
FactCheck : అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా ప్రెగ్నెంట్ అయ్యారంటూ పోస్టులు వైరల్

అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా గర్భవతి అయినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

“BREAKING: Michelle Obama silences ALL conspiracy theorists and demands a universal apology after FINALLY releasing glowing pregnancy photos when she was expecting Sasha and Malia. (sic)” అంటూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు.

ఈ ఫోటోలకు సంబంధించిన పోస్టుకు 1800కు పైగా లైక్స్ రాగా.. 918.1K పైగా వ్యూస్ వచ్చాయి.

మిచెల్ ఒబామా పుకార్లు, తప్పుడు సమాచారాలకు బాధితురాలిగా మారడం ఇదే మొదటిసారి కాదు. ఆమె IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ద్వారా తన కుమార్తెలకు గర్భం దాల్చిన ట్రాన్స్ ఉమెన్ అనే నకిలీ వార్తలు కూడా గతంలో వచ్చాయి.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. ఈ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినవి.

మేము మిచెల్ ఒబామా, బరాక్ ఒబామా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో సారూప్య చిత్రాలను కనుగొనడానికి కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. వైరల్ అవుతున్న ఫోటోలకు సరిపోలే ఎటువంటి ఫలితాలను కనుగొనలేకపోయాము.

మిచెల్ ఒబామా తన గర్భం దాల్చినట్లు సోషల్ మీడియాలో వీడియోలను అప్‌లోడ్ చేసి ఉంటే, అది కచ్చితంగా అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించి ఉండేది. ఏ విశ్వసనీయమైన మీడియా అవుట్‌లెట్‌లోనూ మేము అలాంటి నివేదికను కనుగొనలేకపోయాము.


మిచెల్ ఒబామా ఒరిజినల్ ఫోటోలకు.. ఈ వైరల్ ఫోటోలకు ఉన్న తేడాలను కూడా మేము గమనించాం. చిత్రాలను నిశితంగా విశ్లేషించినప్పుడు, మిచెల్ ఒబామా భౌతిక వేళ్లు, ముఖ లక్షణాలు, బ్యాగ్రౌండ్ కూడా అస్పష్టంగా ఉన్నట్లు మేము కనుగొన్నాము. ఇది సాధారణంగా AI రూపొందించిన చిత్రాలలో కనిపిస్తుంది.

మిచెల్ ఒబామా 50 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. సాషా, మాలియా ఒబామాలకు ఇప్పటికి 25, 22 సంవత్సరాల వయస్సు ఉంది.


మరింత నిర్ధారణ కోసం.. మేము ఆప్టిక్ AI అనే AI టూల్ ద్వారా మొత్తం నాలుగు చిత్రాలను సెర్చ్ చేసాం. ఆ చిత్రాలు AI ద్వారా రూపొందించినట్లు ఫలితాలు ప్రకటించాయి.

మిచెల్ ఒబామా కుడి చేతికి ఆరు వేళ్లు ఉన్నారని మరొక క్లెయిమ్‌తో అదే X వినియోగదారు చేసిన మరో ట్వీట్‌ను మేము కనుగొన్నాము.

“BREAKING: Michelle Obama FINALLY releases photos proving to CONSPIRACY theorists that she always had 6 fingers, on one hand, all along DEMANDING a universal apology from everybody or a small donation to a charity of her choice. (sic)” అంటూ మరో పోస్టును కూడా మేము గమనించాం.

ఈ ట్వీట్ కు కామెంట్లలోనే పలువురు సమాధానం చెప్పారు. రెండు చేతులకు ఐదు వేళ్లు మాత్రమే ఉన్నాయని.. మిచెల్ ఒబామా చిత్రాన్ని అప్‌లోడ్ చేశారు. వైరల్ చిత్రం కూడా AI ద్వారా రూపొందించారని తేలింది.

కాబట్టి, మిచెల్ ఒబామా గర్భం దాల్చిందనే వైరల్ చిత్రాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించారు.

Credits : Sunanda Naik

Claim Review:అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా ప్రెగ్నెంట్ అయ్యారంటూ పోస్టులు వైరల్
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X
Claim Fact Check:False
Next Story