వింతగా కనిపిస్తున్న శిశువు ఫొటోలతో పాటు ఓ కథనం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వైరల్ చిత్రాలలో ఓ పెద్ద పంది పక్కన ఉంచిన శిశువును చూపుతున్నాయి. వింత శిశువును "పిగ్ హ్యూమన్ హైబ్రిడ్ బేబీ" అని పిలుస్తున్నారు.
పేరును క్లూగా తీసుకొని, మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. లైరా మగనుకో మిలాన్ ప్రాంతానికి చెందిన ఒక కళాకారిణి అని మేము కనుగొన్నాము. హైపర్-రియల్ సిలికాన్ శిల్పాలను తయారు చేస్తారు.
Advertisement
ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీని జాగ్రత్తగా విశ్లేషించినప్పుడు, ఆమె వింతగా ఉండే హైపర్-రియల్ సిలికాన్ శిల్పాలను తీర్చి దిద్దడంలో పాపులర్ అయిందని మేము కనుగొన్నాము.
ఆమె వెబ్‌సైట్ లో కూడా అదే విషయాలను తెలిపింది. మేము ఆమె Facebook పేజీలో కూడా అదే చిత్రాలను కనుగొన్నాము. ఆమె ఆర్ట్ వర్క్ ను కొందరు కావాలనే తప్పుడు కథనాలతో వైరల్ చేస్తూ వస్తున్నారు.