FactCheck : సచిన్ టెండూల్కర్ పాదాలకు మ్యాక్స్ వెల్ మొక్కాడా?

ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ మాజీ క్రికెటర్, లెజెండ్ సచిన్ టెండూల్కర్ ముందు వంగి ఉన్నట్లు చూపించిన

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Nov 2023 1:15 PM GMT
FactCheck : సచిన్ టెండూల్కర్ పాదాలకు మ్యాక్స్ వెల్ మొక్కాడా?

ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ మాజీ క్రికెటర్, లెజెండ్ సచిన్ టెండూల్కర్ ముందు వంగి ఉన్నట్లు చూపించిన చిత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సచిన్ పాదాలకు మ్యాక్స్ వెల్ మొక్కినట్లుగా పలువురు ప్రచారం చేస్తున్నారు.

నవంబర్ 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన ICC క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ తర్వాత గౌరవ సూచకంగా మాక్స్‌వెల్ టెండూల్కర్ పాదాలను తాకినట్లుగా ప్రచారం చేస్తున్నారు. అదే వాదనతో ఈ చిత్రాన్ని పంచుకుంటూ ఉన్నారు. ఈ మ్యాచ్‌లో మాక్స్‌వెల్ డబుల్ సెంచరీని బాది ఆసీస్ కు విజయాన్ని అందించాడు.

వైరల్ చిత్రం క్యాప్షన్‌ లో “సచిన్ టెండూల్కర్ గ్రౌండ్‌లో మాక్స్‌వెల్‌ను అభినందించడానికి వచ్చినప్పుడు, అతను సచిన్ టెండూల్కర్ పాదాలను తాకి ఆశీస్సులు కోరాడు. క్రికెట్ చరిత్రలో గొప్ప క్షణాలలో ఒకటి. మ్యాక్స్ వెల్ భారతీయురాలిని వివాహం చేసుకున్నాడు.” అంటూ ప్రచారం చేస్తున్నారు.

నిజ నిర్ధారణ :

వైరల్ చిత్రాన్ని ఫోటోషాప్ చేశారని న్యూస్‌మీటర్ కనుగొంది.

మేము వైరల్ ఇమేజ్‌ని ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడం ద్వారా మా పరిశోధనను ప్రారంభించాము. గెట్టి ఇమేజెస్‌లో అప్‌లోడ్ చేసిన సచిన్ టెండూల్కర్ చిత్రాన్ని కనుగొన్నాము. సచిన్ టెండూల్కర్ ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడితో కరచాలనం చేయడాన్ని మీరు చూడవచ్చు.


క్యాప్షన్ ద్వారా.. ఆస్ట్రేలియా & ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నెట్ సెషన్స్ లో సమయంలో ఈ ఫోటో ను తీశారు. నవంబర్ 06న భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీమ్ సభ్యులతో మాట్లాడారు. ముంబైలో ఈ ఫోటోను తీశారు. (ఫోటో రాబర్ట్ సియాన్‌ఫ్లోన్/జెట్టి ఇమేజెస్) అని తెలుసుకోవచ్చు.

ఆఫ్ఘనిస్తాన్ Vs ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ఒక రోజు ముందు వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ అదే టీ-షర్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టును కలిసిన ఫోటోలు, వీడియోలను కూడా మనం గుర్తించాం.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. నవంబర్ 6న ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో టెండూల్కర్ ఫోజులు ఇచ్చారు. “మంగళవారం వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో 2023 ప్రపంచ కప్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్నప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ జట్టును బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ కలిశారు. కొద్దిసేపు మాట్లాడారు" అని తెలిపారు.

నవంబర్ 7 నాటి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధికారిక Facebook హ్యాండిల్‌లో కూడా సచిన్ కు సంబంధించిన వీడియోను పోస్టు చేసారు. ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ కప్ మ్యాచ్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు సలహాలు ఇస్తూ కనిపించారు టెండూల్కర్.

సచిన్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లను కలిసిన సమయంలో తీసిన వైరల్ ఇమేజ్, ఫోటో పోలిక ఇక్కడ ఉంది. మాక్స్‌వెల్ సచిన్ పాదాలను తాకినట్లు కనిపించేలా సచిన్ ఇమేజ్ ఒరిజినల్ వీడియో నుండి ఎడిట్ చేశారు. మ్యాక్స్‌వెల్ చిత్రాన్ని ఫోటోషాప్ చేశారని ఈ పోలిక ద్వారా తెలుసుకోవచ్చు.

ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ తర్వాత సచిన్ మైదానంలోకి వెళ్లడంపై ఎలాంటి మీడియా నివేదికలు కూడా మాకు కనిపించలేదు.


కాబట్టి, వైరల్ చిత్రం ఫోటోషాప్ చేశారని మేము నిర్ధారించాము.

Credit : Sunanda Naik

Claim Review:సచిన్ టెండూల్కర్ పాదాలకు మ్యాక్స్ వెల్ మొక్కాడా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter, Facebook
Claim Fact Check:False
Next Story