అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం ముందు ఓ మహిళ కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దావూద్ ఆఫీసులో కూర్చుని ఉండగా.. ఆమె ఎదుట ఓ మహిళ కూర్చుంది.. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంతో మాజీ జర్నలిస్ట్, కాంగ్రెస్ ప్రస్తుత అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే పోజులిచ్చినట్లు ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్న వారు చెబుతున్నారు.
నిజ నిర్ధారణ :
అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం ముందు ఓ మహిళ కూర్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంతో మాజీ జర్నలిస్ట్, కాంగ్రెస్ ప్రస్తుత అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే పోజులిచ్చినట్లు ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్న వారు చెబుతున్నదాన్లో ఎటువంటి నిజం లేదు.
దావూద్ ఇబ్రహీంతో ఉన్న మహిళ 'షీలా భట్' అనే జర్నలిస్టు అని, సుప్రియా శ్రీనాతే కాదని న్యూస్‌మీటర్ కనుగొంది. రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో.. జూన్ 14న ఈ చిత్రాన్ని భట్ ట్వీట్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఆమె 1987లో దుబాయ్‌లోని పెరల్ బిల్డింగ్‌లో దావూద్ ఇబ్రహీంను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు తీసిన చిత్రం అని పేర్కొంది.
మరో ట్వీట్‌లో, దావూద్‌తో తన ఇంటర్వ్యూలకు సంబంధించి మ్యాగజైన్ అభియాన్ ను కూడా పోస్టు చేశారు. 1987లో ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ కవర్ పేజీలను మనం చూడవచ్చు.
అంతేకాకుండా, 1977లో సుప్రియ జన్మించారని, ఈ వైరల్ చిత్రాన్ని క్లిక్ చేసినప్పుడు ఆమెకు కేవలం పదేళ్లు మాత్రమేనని మేము గుర్తించాం.
దావూద్ ఇబ్రహీం జర్నలిస్ట్ షీలా భట్‌తో ఉన్న చిత్రం కాస్తా.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియాతో ఉన్నట్లు తప్పుడు వాదనతో షేర్ చేశారని మేము నిర్ధారించాం.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనల్లో ఎటువంటి నిజం లేదు.
Credits : Mahfooz Alam