Fact Check : బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ ప్రయోగం విఫలమైందా..?
Viral claim that BrahMos supersonic cruise missile. భారత్ గురించి తప్పుడు వార్తలను పోస్టు చేయడమే పనిగా పెట్టుకునే
By Medi Samrat Published on 30 Nov 2020 1:26 PM ISTభారత్ గురించి తప్పుడు వార్తలను పోస్టు చేయడమే పనిగా పెట్టుకునే ట్విట్టర్ ఖాతా 'Irmak Doya' మరో సారి ఓ వార్తను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. భారత్ చేపట్టిన సర్ఫేస్-టు-సర్ఫేస్ సూపర్ సోనిక్ మిసైల్ ప్రయోగం విఫలమైందని ట్వీట్ చేశారు.
Once again India has been failed in testing the surface-to-surface supersonic cruise missile. pic.twitter.com/ChRmFzaTnq
— Irmak Idoya इरमक ईड्या🇳🇵 (@Irmaknepal) November 25, 2020
అకౌంట్ లో ఒక వీడియోను కూడా పోస్టు చేశారు. ఓ మిసైల్ ను ప్రయోగించిన కొన్ని సెకెండ్ల లోనే కూలిపోవడం అందులో ఉంది.
నిజ నిర్ధారణ:
భారత్ చేపట్టిన సర్ఫేస్-టు-సర్ఫేస్ సూపర్ సోనిక్ మిసైల్ ప్రయోగం విఫలమైందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
వార్తలను చూసుకుంటే భారత్ చేపట్టిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ ప్రయోగం విజయవంతమైంది. పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. కానీ ఇలాంటి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి.. అందరినీ తప్పుద్రోవ పట్టించాలని భావిస్తూ ఉన్నారు. భారత్ చేపట్టిన ప్రయోగం విఫలమైందంటూ ప్రచారం చేయాలని అనుకుంటూ ఉన్నారు.
Indian Army successfully launched its BrahMos supersonic cruise missile on 24 Nov 2020 in a top-attack configuration, hitting a target in the Bay of Bengal with pin point accuracy.#IndianArmy#SouthernCommand @DRDO_India#WarriorsoftheSouth#BrahMosMissile@adgpi pic.twitter.com/vec6Txdqgo
— Southern Command INDIAN ARMY (@IaSouthern) November 24, 2020
బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని భారత ఆర్మీ కూడా స్పష్టం చేసింది. కార్ నికోబార్ ఐలాండ్స్ లో ఈ ప్రయోగం చేపట్టారు. బంగాళాఖాతంలో నిర్దేశించిన లక్ష్యాన్ని బ్రహ్మోస్ క్షిపణి కూల్చి వేసింది. Southern Command Indian Army కూడా భారత్ బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిందని 24 నవంబర్ 2020న ట్వీట్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను కూడా పోస్టు చేశారు. నవంబర్ 24న 10 గంటల సమయంలో బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం జరిగింది. డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవెలప్మెంట్ ఆర్గనైజేషన్(డి.ఆర్.డి.ఓ.) ఈ మిసైల్ రేంజిని 298 కిలోమీటర్ల నుండి 450 కిలోమీటర్లకు పెంచింది.
#BrahMosMissile#SouthernCommand pic.twitter.com/Pxi4XBLnd2
— Southern Command INDIAN ARMY (@IaSouthern) November 24, 2020
భారత్ చేపట్టిన సర్ఫేస్-టు-సర్ఫేస్ సూపర్ సోనిక్ మిసైల్ ప్రయోగం విఫలమైందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. భారత్ చేపట్టిన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగాలు విజయవంతమయ్యాయి.