ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలను పెంచుతున్నట్లు ఓ వ్యక్తి చెబుతున్న ఆడియో క్లిప్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్‌లోని అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్పీడ్ గన్‌లు ఏర్పాటు చేశామని, సిగ్నల్ జంపింగ్‌పై జరిమానాను రూ. 1,035 నుండి రూ. 1,635 పెంచామని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. అతని మూడు వాహనాలకు అతివేగంతో రూ. 4,500 జరిమానా కూడా చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు.
న్యూస్‌మీటర్ వాట్సాప్ టిప్‌లైన్ నంబర్‌కు కూడా ఆ ఆడియో ఫార్వర్డ్ చేయబడింది.
నిజ నిర్ధారణ :
హైదరాబాద్‌లో సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడ్‌పై జరిమానాలు పెంచలేదని న్యూస్‌మీటర్ తేల్చింది.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వెబ్‌సైట్‌ను పరిశీలించగా.. సిగ్నల్ జంపింగ్‌కు జరిమానా టూవీలర్‌కు రూ. 1,000 కాగా, త్రీ వీలర్, ఫోర్ వీలర్, ఆరు చక్రాల వాహనాలు.. ఏదైనా వాహనానికి అతివేగానికి జరిమానా రూ. 1,400 గా ఉంది.
ఈ-చలాన్ అధికారి ఎం. నర్సింగ్ రావు న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ కొత్త స్పీడ్ గన్‌లను ఏర్పాటు చేయలేదని, వాటిని ఇప్పటికే 25కి పైగా చోట్ల కెమెరాల్లో అమర్చామని తెలిపారు. సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడ్ ల జరిమానాలు పెంచలేదని ఆయన ధృవీకరించారు.
కాబట్టి.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలు పెంచారనే వాదన అబద్ధమని మేము నిర్ధారించాము.