కాషాయరంగు నేమ్ బోర్డుని ధ్వంసం చేయడం వెనుక మతపరమైన కోణం లేదుబెంగళూరులోని రామ్‌దేవ్ హాయ్ ఫ్యాషన్ నేమ్ బోర్డ్‌ను కొందరు వ్యక్తులు ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాషాయ రంగు బోర్డు కారణంగా వస్త్ర దుకాణానికి సంబంధించిన నేమ్ బోర్డ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు పోస్టులు పెడుతున్నారు.
"కాంగ్రెస్‌కు ఓటు వేయడం ద్వారా, మీరు మీ దుకాణం, ఇల్లు, ప్రాంతం, దేవాలయం మొదలైన వాటికి కాషాయ రంగును ఉపయోగించలేరు -- కర్ణాటక" అని వీడియోను షేర్ చేసిన X వినియోగదారులు పోస్టులు పెట్టారు.
చాలా మంది X వినియోగదారులు అదే వాదనను క్లెయిమ్ చేస్తూ వీడియోను షేర్ చేసారు. వీడియో ఫేస్‌బుక్‌లో కూడా వైరల్ అవుతుంది.
నిజ నిర్ధారణ:
బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) పరిధిలో నేమ్ బోర్డును కన్నడ భాషలో లేని షాపుల నేమ్ బోర్డులను పాడుచేస్తున్నట్లు వీడియోలో చూపించారు. వైరల్ అవుతున్న వాదన తప్పుదోవ పట్టించేదిగా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది.
వీడియో కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఫిబ్రవరి 24న అదే వీడియోను NewsHamster అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసినట్లు మేము కనుగొన్నాము. కొందరు వ్యక్తులు కన్నడలో నేమ్ బోర్డులు లేని షాపుల దగ్గరకు వెళ్లి ఆ నేమ్ బోర్డులను తీసివేస్తున్నట్లు వీడియో వైరల్ అవుతూ ఉంది. ఇది బీబీఎంపీ కార్మికులే చేశారని కూడా మేము గుర్తించాము.
ఈ లీడ్ ను ఆధారంగా తీసుకుని మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. ఫిబ్రవరి 23న ప్రచురించిన ఇండియా టుడే వీడియో నివేదికను చూశాము. “Bengaluru’s Language War: BBMP Cracks Down on English Signboards Ahead of Deadline.” అనే టైటిల్ తో ఈ ఘటనను నివేదించారు. రామ్‌దేవ్ హాయ్ ఫ్యాషన్, బర్గర్ కింగ్‌తో సహా అనేక సంస్థల నేమ్ బోర్డు నుండి కార్మికులు ఆంగ్ల అక్షరాలను తీసివేస్తున్న దృశ్యాలు వైరల్ వీడియోలో రికార్డు అయ్యాయి.
నివేదిక ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని వివిధ సంస్థల్లోని నేమ్ బోర్డులలో 60% కన్నడ వినియోగం తప్పనిసరి. ఫిబ్రవరి 28వ తేదీ వరకు BBMP గడువు ఉన్నప్పటికీ, నిర్ణీత గడువు కంటే ముందే ఆంగ్ల నేమ్ బోర్డులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.
గూగుల్ మ్యాప్స్ లో స్ట్రీట్ వ్యూను ఉపయోగించి.. మేము బెంగళూరులోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ సమీపంలోని తంబుచెట్టి పాళ్యలో 'రామ్‌దేవ్ హాయ్ ఫ్యాషన్' దుకాణాన్ని గుర్తించాము. న్యూస్‌మీటర్ షాప్ యజమానిని సంప్రదించింది, నేమ్ బోర్డు ఆంగ్లంలో ఉన్నందున తన షాప్ బోర్డును BBMP కార్మికులు తీసేశారని ఆయన ధృవీకరించారు.
నేమ్ బోర్డుకు కాషాయ రంగు ఉండడం వలన ధ్వంసం చేస్తున్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Credits: Md Mahfooz Alam