FactCheck : బురఖాలో ఉన్న అమ్మాయిని అసభ్యంగా తాకుతున్న వీడియో భారత్ లో చోటు చేసుకుంది కాదు

Video of man Inappropriately touching burqa clad girl is from bangladesh not india. బురఖా ధరించిన అమ్మాయిని ఓ వ్యక్తి అనుచితంగా తాకడం, కర్రతో కొట్టడం వంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Jun 2023 8:30 PM IST
FactCheck : బురఖాలో ఉన్న అమ్మాయిని అసభ్యంగా తాకుతున్న వీడియో భారత్ లో చోటు చేసుకుంది కాదు

బురఖా ధరించిన అమ్మాయిని ఓ వ్యక్తి అనుచితంగా తాకడం, కర్రతో కొట్టడం వంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


#Savemuslimgirls #Bhagwa_Love_Trap #bhagvalovetrap అనే హ్యాష్ ట్యాగ్స్ ను ఉపయోగిస్తూ వీడియోను షేర్ చేస్తూ ఉన్నారు.

ఇటీవలి కాలంలో "భగ్వా లవ్ ట్రాప్" సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిందూ పురుషులు ముస్లిం స్త్రీలను ట్రాప్ చేస్తున్నారంటూ చెబుతున్నారు. "లవ్ జిహాద్ కుట్ర"కు ఇది వ్యతిరేకంగా చేస్తున్నారు.

నిజ నిర్ధారణ :

ఆ వీడియో బంగ్లాదేశ్‌కు చెందినదని న్యూస్‌మీటర్ కనుగొంది.

వీడియో కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా.. జూలై 8, 2020న ఫేస్ బుక్ వినియోగదారు పోస్ట్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము. ఆ వీడియో బారిసాల్ జిల్లాలోని ఉజిర్‌పూర్ సోనార్ బంగ్లా సెకండరీ స్కూల్ హెడ్‌మాస్టర్ నూరుల్ హక్‌ చేసిన దారుణమైన పనిని చూపుతుందని క్యాప్షన్ పేర్కొంది.

బరిసాల్ దక్షిణ మధ్య బంగ్లాదేశ్‌లోని ఒక జిల్లా.

దీనిని ఒక క్లూగా తీసుకొని, మేము బంగ్లాలో కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. జూలై 22, 2020 నుండి బంగ్లాదేశ్ ఆధారిత కలేర్‌కాంతో నుండి ఒక నివేదికను చూశాము. ఈ నివేదిక వైరల్ వీడియో నుండి స్టిల్స్‌ను కలిగి ఉంది.

ఈ వీడియో 2016 నాటిదని, ఆ వ్యక్తి ఉజిర్‌పూర్‌లోని సోనార్ బంగ్లా సెకండరీ స్కూల్ హెడ్‌మాస్టర్ నూరుల్ హక్ సర్దర్‌ అని పేర్కొంది.


మేము 2022లో ఈ వీడియోకు సంబంధించి బహుళ నివేదికలను కనుగొన్నాము. ఇందులోని వ్యక్తిని నూరుల్ హక్ సర్దర్‌గా గుర్తించారు.

బంగ్లాదేశ్‌లోని ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని అనుచితంగా తాకినట్లు కథనాలు గతంలోనే వైరల్ అయ్యాయి. “భగ్వా లవ్ ట్రాప్” కుట్రతో తప్పుగా లింక్ చేశారని మేము నిర్ధారించాము.

Credits : MD Mahfooz Alam



Claim Review:బురఖాలో ఉన్న అమ్మాయిని అసభ్యంగా తాకుతున్న వీడియో భారత్ లో చోటు చేసుకుంది కాదు
Claimed By:Socialmedia Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter
Claim Fact Check:False
Next Story