నిజమెంత: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నమాజ్ చేస్తున్న వీడియో ఇటీవలిది కాదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శపథం చేసిన 31 నెలల తర్వాత జూన్ 21న ఏపీ అసెంబ్లీకి తిరిగి వచ్చారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Jun 2024 8:00 AM ISTనిజమెంత: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నమాజ్ చేస్తున్న వీడియో ఇటీవలిది కాదు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తాను సీఎం అయిన తర్వాతే తిరిగి వస్తానని శపథం చేసిన 31 నెలల తర్వాత జూన్ 21న ఏపీ అసెంబ్లీకి తిరిగి వచ్చారు. నవంబర్ 2021లో.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని అయిన తర్వాత మాత్రమే తిరిగి సభలోకి అడుగుపెడతానని ప్రతిజ్ఞ చేశారు. ఇటీవల ముగిసిన 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కూటమి ఘనవిజయం సాధించిన తర్వాత ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
ఈ నేపథ్యంలో బక్రీద్ సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు నమాజ్‌లో పాల్గొన్న వీడియో వైరల్‌గా మారింది. ఈద్ సందర్భంగా చంద్రబాబు నాయుడు
2024 AP ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ఈ వీడియోను రికార్డు చేసినట్లుగా వీడియోను షేర్ చేస్తున్నారు. “చంద్రబాబు నాయుడు ఈద్ అల్ అధా ప్రార్థన 1445H, (sic)” అనే శీర్షికతో ఒక Facebook వినియోగదారు వీడియోను పోస్ట్ చేశారు. వీడియోలో చంద్రబాబు నాయుడు సాంప్రదాయ స్కల్ క్యాప్ ధరించి ఇతర ముస్లింలతో కలిసి ప్రార్థనలలో పాల్గొంటున్నారు. ‘విజయవాడలోని గాంధీ మునిసిపల్ స్టేడియంలో సీఎం నమాజ్ చేశారు.’ అని వీడియోలో ఉంది.
అదేవిధంగా, ఒక X వినియోగదారు అదే వీడియోను ఇటీవలి వీడియో అని చెబుతూ వీడియోను పోస్టు చేశారు. 57 సెకన్ల నిడివి గల వీడియోలో ప్రముఖ వార్తా సంస్థ ANI లోగో ఉంది.(Archive)
పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
ఈ వీడియో పాతదని.. ప్రజలను తప్పుదోవ పట్టించేదని న్యూస్ మీటర్ కనుగొంది.
ముస్లింలకు రెండు పండుగలు చాలా ముఖ్యమైనవి. ఒకటి రంజాన్.. మరొకటి బక్రీద్. రంజాన్ ను ఈద్ ఉల్ ఫితర్ అంటారు. బక్రీద్ ను ఈద్ ఉల్ అదా అని అంటారు. సంవత్సరంలో వేర్వేరు సమయాల్లో ఈ పండుగలను జరుపుకుంటారు. ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ మాసం ముగింపును సూచిస్తుంది, అయితే ఈద్ ఉల్ అదా దేవుని ఆజ్ఞకు విధేయతతో తన కుమారుడిని బలి ఇవ్వడానికి ఇబ్రహీం చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తుంది. ఇటీవలే బక్రీద్ ను ఘనంగా ప్రజలు జరుపుకున్నారు.
వైరల్ విజువల్స్ నుండి స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఆరేళ్ల క్రితం ఏఎన్‌ఐ యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేసిన ఒరిజినల్ ఫుటేజీని మేము కనుగొన్నాం. 1 నిమిషం 28 సెకన్ల నిడివి గల వీడియోకు ‘ఈద్-ఉల్-ఫితర్ గుర్తుగా సీఎం నాయుడు నమాజ్ చేస్తున్నారు - ఆంధ్ర ప్రదేశ్ వార్తలు.’ అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.
ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. "Andhra Pradesh: Chief Minister N Chandrababu Naidu offers Namaz at Gandhi Municipal Stadium in Vijayawada #EidulFitr." అంటూ ఏఎన్ఐ జూన్ 16, 2018న ట్వీట్ పెట్టింది.
చంద్రబాబు నాయుడు గతంలో మూడు పర్యాయాలు ఏపీ సీఎంగా పనిచేశారు. ఆయన 1995 నుండి 1999 వరకు.. 1999 నుండి 2004 వరకు; మరియు 2014 నుండి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందుకే, వీడియోలో 2018లో AP CM అని సూచించారు. జూన్ 12, 2024న ముఖ్యమంత్రిగా నాలుగో టర్మ్ ను ప్రారంభించాడు.
కీవర్డ్ సెర్చ్ చేయగా.. జూన్ 16, 2018 న ది సియాసత్ డైలీ నివేదికకు కనుగొన్నాం. చంద్రబాబు నాయుడు ఈద్ ప్రార్థనలలో పాల్గొన్నారని పేర్కొంది. ఈద్ ఉల్ ఫితర్‌ను పురస్కరించుకుని విజయవాడలోని ముస్లిం సమాజంతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఉర్దూలో ప్రసంగించారని.. శుభాకాంక్షలు తెలియజేశారన్నారు.
కాబట్టి, సీఎం చంద్రబాబు నాయుడు ఈద్ నమాజ్ చేస్తున్న వీడియో 2018 నాటిది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.నిజమెంత: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నమాజ్ చేస్తున్న వీడియో ఇటీవలిది కాదు