నిజమెంత: మీడియా నుండి తప్పించుకుని పారిపోడానికి అఖిలేష్ యాదవ్ ఏకంగా గేటు దూకారా?

లోక్‌సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ మీడియా నుంచి పారిపోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Sept 2024 2:00 PM IST
నిజమెంత: మీడియా నుండి తప్పించుకుని పారిపోడానికి అఖిలేష్ యాదవ్ ఏకంగా గేటు దూకారా?

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ మీడియా నుంచి పారిపోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది.

ఒక X వినియోగదారు “మీరు పారిపోయిన నాయకుడిని ఎన్నడూ చూడకపోతే, ఇదిగోండి! ఓ జర్నలిస్టు అఖిలేష్‌ని ప్రశ్నించగా, అతడు పారిపోయాడు." అంటూ పోస్టు పెట్టారు.



19 సెకన్ల క్లిప్‌లో అఖిలేష్ యాదవ్ ఓ గేటును ఎక్కుతున్నట్లు చూడొచ్చు. మీడియా సిబ్బంది, పలువురు ఆయనను చుట్టుముట్టారని వీడియోలో మనం చూడొచ్చు.

ఇదే వాదనతో పలు సోషల్ మీడియా సైట్స్ లో పోస్టులు పెట్టారు.

నిజ నిర్ధారణ:

న్యూస్‌మీటర్ వైరల్ వీడియోలో ఎలాంటి నిజం లేదని కనుగొంది.

వైరల్ పోస్టులోని విజువల్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ వీడియో ఇటీవలిది కాదని 2023లో చోటు చేసుకుందని మేము గుర్తించాం.

అక్టోబర్ 11, 2023న 'జయప్రకాష్ నారాయణ్‌కు నివాళులు అర్పించేందుకు అఖిలేష్ యాదవ్ JPNIC సరిహద్దు గోడను దూకారు' అనే శీర్షికతో ది ఎకనామిక్ టైమ్స్ పోస్ట్ చేసిన యూట్యూబ్ వీడియోని మేము గుర్తించాం.

వార్తా నివేదికలో అఖిలేష్ యాదవ్ గేటును దాటుతున్న విజువల్స్ ను చూడొచ్చు.

నివేదిక ప్రకారం, లక్నోలో, స్వాతంత్ర్య సమరయోధుడు, ఎమర్జెన్సీ వ్యతిరేక ప్రచారకుడు జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు జై ప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ (జెపిఎన్‌ఐసి)లోకి ప్రవేశించాలని అనుకున్నారు. అయితే ఎస్పీ చీఫ్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు. ఆ సందర్భంగా భారీ డ్రామా చోటు చేసుకుంది.

కీవర్డ్ సెర్చ్ చేయగా.. The Times of India లో ‘Akhilesh Yadav climbs locked entrance to pay tribute to Jayaprakash Narayan on his birth anniversary’ అనే ఆర్టికల్ ను చూడొచ్చు. అక్టోబర్ 11, 2023న కథనాన్ని ప్రసారం చేశారు.

జయప్రకాష్ నారాయణ్‌కు నివాళులు అర్పించేందుకు ఎస్పీ కార్యకర్తలు ప్రయత్నించగా అడ్డుకుంటున్నారని, ఈ విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అఖిలేష్ యాదవ్ చెప్పారని నివేదిక తెలిపింది. సమాజ్‌వాదీ నేతలు ప్రతి సంవత్సరం ఆయన జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేస్తున్నారని, అయితే ఈసారి వారు గేటు ఎక్కాల్సి వచ్చిందని అఖిలేష్ వివరించారు. అక్టోబర్ 11,2023న తన JPNIC ఖాతాలో అఖిలేష్ యాదవ్ యూపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన X పోస్ట్‌ను కూడా మేము కనుగొన్నాము.

వైరల్ వీడియోలో అఖిలేష్ యాదవ్ మీడియా ప్రశ్నలను ఎదుర్కోలేక పారిపోలేదు. జయప్రకాష్ నారాయణ్‌ కు నివాళులు అర్పించేందుకు గేటు ఎక్కారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim Review:నిజమెంత: మీడియా నుండి తప్పించుకుని పారిపోడానికి అఖిలేష్ యాదవ్ ఏకంగా గేటు దూకారా?
Claimed By:Social media user
Claim Reviewed By:NewsMeter
Claim Source:X Users
Claim Fact Check:False
Next Story