FactCheck : ఆ వీడియో క్లిప్ ఇజ్రాయెల్ కు సంబంధించినది కాదు.. వీడియో గేమ్ కు సంబంధించినది

అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఆకస్మిక దాడి చేసింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Oct 2023 3:47 PM GMT
FactCheck : ఆ వీడియో క్లిప్ ఇజ్రాయెల్ కు సంబంధించినది కాదు.. వీడియో గేమ్ కు సంబంధించినది

అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఆకస్మిక దాడి చేసింది. హమాస్ మిలిటెంట్ సభ్యుడు ఇజ్రాయెల్ ఆర్మీ హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు చూపుతున్నట్లు వినియోగదారులు తెలిపారు. ఒక వ్యక్తి మిసైల్స్ ద్వారా ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్లు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక ట్విట్టర్ ప్రీమియం వినియోగదారుడు ఈ వీడియోను “హమాస్ యోధులు ఇజ్రాయెల్ హెలికాప్టర్‌ను గాజాలో కూల్చివేశారు” అంటూ క్యాప్షన్‌తో వీడియోను పంచుకున్నారు.


పలువురు ట్విట్టర్ వినియోగదారులు కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నిజ నిర్ధారణ :

ఈ వీడియో క్లిప్ ARMA 3 అనే వీడియో గేమ్ కు సంబంధించినదని NewsMeter కనుగొంది.

వీడియో కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఆగస్ట్ 16న ఫేస్‌బుక్ పేజీ, నోఖైలా కాగాలో పోస్ట్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము. పోస్ట్‌లోని తేదీ ఇజ్రాయెల్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న దానికంటే ముందేనని తెలుస్తోంది.

మేము ఈ పోస్ట్‌ కు సంబంధించిన కామెంట్లను చూశాం. ఈ క్లిప్ షూటర్ సిమ్యులేషన్ వీడియో గేమ్ అయిన ARMA 3 కి సంబంధించిన వీడియో అని వినియోగదారులు కామెంట్లలో చెబుతున్నారు.


ఆ వీడియో అబౌట్ సెక్షన్ లో బంగ్లాదేశ్‌లోని ఢాకాకు చెందిన ‘గేమింగ్ వీడియో క్రియేటర్’ ఈ పేజీని నిర్వహిస్తున్నట్లు తెలిపింది.-

మేము ఫిబ్రవరి 27, 2023న ధృవీకరించిన YouTube ఛానెల్, RIM స్టూడియో ద్వారా ప్రచురించిన వీడియోను కూడా కనుగొన్నాము. వీడియో వివరణలో ఆ వీడియో నిజమైనది కాదని తెలిపారు.


వైరల్ వీడియోలో ఇజ్రాయెల్ హెలికాప్టర్‌ను కూల్చివేసిన దృశ్యాలు నిజమైనవి కావని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.

Claim Review:ఆ వీడియో క్లిప్ ఇజ్రాయెల్ కు సంబంధించినది కాదు.. వీడియో గేమ్ కు సంబంధించినది
Claimed By:X Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X
Claim Fact Check:False
Next Story