నిజమెంత: రోహింగ్యా ముస్లింలు సాధువుల్లా నటిస్తూ పోలీసులకు పట్టుబడ్డారా?

మీరట్‌లో సాధువులుగా మారువేషంలో ఉన్న ముగ్గురు రోహింగ్యా ముస్లింలను పట్టుకున్నారనే వాదనతో ఓ వీడియో వైరల్‌గా మారింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 July 2024 9:00 AM IST
fact check,  rohingya muslims,  sadhus,  meerut,

నిజమెంత: రోహింగ్యా ముస్లింలు సాధువుల్లా నటిస్తూ పోలీసులకు పట్టుబడ్డారా? 

హైదరాబాద్: మీరట్‌లో సాధువులుగా మారువేషంలో ఉన్న ముగ్గురు రోహింగ్యా ముస్లింలను పట్టుకున్నారనే వాదనతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

“The public caught 3 Rohingyas roaming around as sadhus in Meerut. Their names are Md. Shamim, Altam, and Zubair. They used to reconnoiter Hindu localities wearing saffron clothes. The public also accused the three of stealing children.” అనే క్యాప్షన్ తో ట్విట్టర్ యూజర్ వీడియోను షేర్ చేశారు.

మీరట్‌లో సాధువులుగా మారువేషంలో తిరుగుతున్న ముగ్గురు రోహింగ్యాలను ప్రజలు పట్టుకున్నారు. వారి పేర్లు మొహమ్మద్ షమీమ్, అల్తామ్, జుబైర్ అని పోస్టుల్లో తెలిపారు. వారు కాషాయ బట్టలు ధరించి హిందువులు ఉండే ప్రాంతాలలో ఎక్కువగా తిరుగుతూ ఉన్నారు. ముగ్గురు పిల్లలను దొంగిలించారని ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారనే వాదనతో పోస్టులను వైరల్ చేస్తున్నారు.

23 సెకన్ల వీడియోలో, వీడియోగ్రాఫర్ ముగ్గురు వ్యక్తులను హిందీలో వారి గుర్తింపు గురించి ప్రశ్నించడం వినవచ్చు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని న్యూస్‌మీటర్ కనుగొంది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

ఆ వీడియోలో ‘సుదర్శన్ ఉత్తరప్రదేశ్’ లోగో ఉంది. ఈ క్లూని ఉపయోగించి, మేము ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశాం. సుదర్శన్ ఉత్తరప్రదేశ్ వార్తా ఛానెల్ X ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము. ఈ పోస్ట్ లో మీరట్ పోలీసులను, యూపీ పోలీసులను కూడా ట్యాగ్ చేసారు.

మీరట్ పోలీసుల అధికారిక పేజీ దీనిపై కామెంట్ సెక్షన్ లో స్పందించింది. ఈ వ్యక్తులు నాథ్ కమ్యూనిటీకి చెందిన సాధులు/ఫకీర్లు అని వివరించారు. పోలీసుల వివరణలో.. ఈ ముగ్గురినీ ప్రజలు బందీలుగా పట్టుకుని కొట్టారనే వాదనలో ఎలాంటి నిజం లేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు సాధువులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో ముగ్గురూ యమునానగర్ (హర్యానా) నివాసితులని తేలింది. భిక్షాటనలో నిమగ్నమయ్యే నాథ్ కమ్యూనిటీకి చెందిన వారని పోలీసులు వివరించారు.

వీడియో స్క్రీన్‌షాట్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. దైనిక్ భాస్కర్ నివేదికకు దారితీసింది. 'నాధ్ కమ్యూనిటీకి చెందిన సాధువులు మీరట్‌లో అనుమానితులుగా పట్టుబడ్డారు. వారిని కర్రతో బెదిరించారు. పోలీసులకు తీసుకెళ్లారు' అని అందులో ఉంది. వీడియో స్క్రీన్‌షాట్ కూడా వైరల్ ఇమేజ్ ను పోలి ఉంది.

నివేదిక ప్రకారం, ముగ్గురు సాధువులు-సునీల్, గౌరవ్, గోపి-హర్యానాలోని జగధారి, యమునానగర్ నివాసితులు. వారి గుర్తింపులను గ్రామాధికారి, స్థానిక పోలీసులు ధృవీకరించారు. సాధువులు తమ జీవనోపాధి కోసం ఊర్లు తిరుగుతూ ఉన్నారు. వీళ్ళ మీద ఎలాంటి నేర చరిత్ర లేవు.

ముగ్గురు సాధువులను నేరస్థులుగా ముద్ర వేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారనే వాదనతో నవ్ భారత్ టైమ్స్ నివేదికను ప్రచురించింది.

సాధువుల వేషధారణలో ఉన్న ముగ్గురు రోహింగ్యా ముస్లింలు మీరట్‌లో పట్టుబడ్డారనే వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వ్యక్తులు హర్యానాకు చెందిన సాధువులు.

Claim Review:నిజమెంత: రోహింగ్యా ముస్లింలు సాధువుల్లా నటిస్తూ పోలీసులకు పట్టుబడ్డారా?
Claimed By:Social media user
Claim Reviewed By:NewsMeter
Claim Source:X
Claim Fact Check:False
Next Story