సెప్టెంబర్ 27న, హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ప్రాంతంలో మేరీ మాత, దుర్గా విగ్రహాలను ధ్వంసం చేసినందుకు ఇద్దరు బురఖా ధరించిన ముస్లిం మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. స్థానికంగా ఉన్న వ్యక్తి అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఓ మహిళ స్పానర్‌తో దాడికి యత్నించింది. వారిద్దరినీ స్థానికులు పట్టుకుని సైదాబాద్ పోలీసులకు అప్పగించారు.
బుర్ఖా ధరించి వచ్చిన ఇద్దరు మహిళలు.. దుర్గా మాత మండపంపై దాడి చేశారు. దుర్గా మాత ఆసీనులై ఉన్న సింహం విగ్రహం తల భాగం పాక్షికంగా దెబ్బతింది. స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. వారు స్థానికులపైకి కూడా తిరగబడినట్టు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న సైదాబాద్ పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
ఆ మహిళలు కావాలనే ఈ పని చేశారని.. హిందూ ఆలయంపై దాడి చేయడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారని సోషల్ మీడియాలో విమర్శలు చేయడం మొదలుపెట్టారు. "In Hyderabad - 2 women in BorkhaVandalised Ma Durga Murti during Nav-Ratri festival? Shame on Hindus when Anti-National Anti Social Jihadis Broke Hindu Goddesses we can't do anything; Sad is we can't even take their Names - SUCH FEAR OF RIOTS - What is the use of Police, then?" అంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.
పోస్ట్‌ను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ ఈ సంఘటన గురించి శోధించడానికి ఒక కీవర్డ్‌ను అమలు చేసింది. ఈ సంఘటనపై పోలీసుల ప్రకటనను కనుగొంది.
"నలుగురు వ్యక్తులు - తల్లి, తండ్రి, ఇద్దరు అమ్మాయిలు- కలిసి నివసిస్తున్నారు. వారి మానసిక స్థితి సరిగా లేదు. పలు సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వారు 2018 లో జెడ్డా నుండి తిరిగి వచ్చారు. అప్పటి నుండి పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు" అని సెంట్రల్ జోన్ హైదరాబాద్ డిసిపి రాజేష్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
విలేకరుల సమావేశంలో నిందితుడి సోదరుడు అసిమ్‌దుద్దీన్, అతని తల్లి, సోదరీమణులు స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నారని చెప్పారు. వారి తరపున క్షమాపణలు చెప్పారు. ఐపీసీలోని 153-ఏ, 295, 295-ఏ, 451, 504 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. వారికి మానసిక సమస్య ఉందని అతని సోదరుడు చెప్పడంతో మేము వారిని మొదట ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేసి, ఆపై వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.
ఇందులో మతపరమైన కోణం లేదని పోలీసులు చెబుతున్నారు.