Fact Check : ఎమ్మెల్సీ ఎన్నికలపై వి6 ఛానల్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను విడుదల చేసిందా..?

V6 Exit Poll Survey of MLC Elections. తెలంగాణ రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14న ఓటింగ్ జరిగింది. ఉదయం 8 గంటలకు

By Medi Samrat  Published on  17 March 2021 7:59 AM IST
V6 Exit Poll Survey of MLC Elections
తెలంగాణ రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14న ఓటింగ్ జరిగింది. ఉదయం 8 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం నాలుగు వరకూ సాగింది. మహబూబ్ నగర్-రంగా రెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలలో తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపీ, కాంగ్రెస్, పార్టీలే కాకుండా ఇతరులు కూడా పెద్ద ఎత్తున పోటీ చేశారు. ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



ఇలాంటి సమయంలో వి6 వెలుగు మీడియా సంస్థ నుండి ఒక ఎగ్జిట్ పోల్స్ విడుదలైందని.. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడం మొదలైంది. మహబూబ్ నగర్-రంగా రెడ్డి-హైదరాబాద్ స్థానం గురించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం జరిగిందని.. టీఆర్ఎస్ అభ్యర్థికి 52 శాతం ఓట్లు వచ్చాయంటూ పోస్టులు వైరల్ అయ్యాయి.

వరల్డ్ వైడ్ కేసీఆర్ ఫాన్స్ క్లబ్ లాంటి పేజీలలో పోస్టు చేశారు.. ఆ తర్వాత కొద్దిసేపటికి డిలీట్ చేయడం కూడా జరిగింది. క్షణాల్లో ఈ పోస్టు వైరల్ అయింది.

నిజ నిర్ధారణ:

ఎమ్మెల్సీ ఎన్నికలపై వి6 ఛానల్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను విడుదల చేసిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

ఈ వైరల్ పోస్టుపై వి6 ఛానల్ కూడా స్పందించింది. తాము ఎటువంటి సర్వేను కూడా నిర్వహించలేదని.. దీనిపై ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపింది. వైరల్ అవుతున్న పోస్టు ఒక ఫేక్ ఇమేజ్ అంటూ మీడియా సంస్థ వివరణ కూడా ఇచ్చింది.



"It's Fake News..V6 Velugu Did not conduct any survey on this graduates MLC Elections 2021. Don't trust this kind of false news. #FakeNews # mlcelection2021 #Falsesurvey # V6velugu." అంటూ ట్వీట్ కూడా చేసింది. ఇలాంటి తప్పుడు పోస్టులను పోస్టు చేసే వారిపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది వి6 మీడియా సంస్థ.


వైరల్ అవుతున్న పోస్టులో ఉన్న వెబ్ సైట్ పేరు కూడా నిజమైందని కాదని న్యూస్ మీటర్ గుర్తించింది. 'V6velagu.com' అన్నది సదరు మీడియా సంస్థ అధికారిక వెబ్సైట్ లింక్ కాదు.

కాబట్టి వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలపై వి6 ఛానల్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను విడుదల చేసిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.


Claim Review:ఎమ్మెల్సీ ఎన్నికలపై వి6 ఛానల్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను విడుదల చేసిందా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media
Claim Fact Check:False
Next Story