FactCheck : ఆ వీడియోలు, ఫోటోలకు లాలూ ప్రసాద్ కుటుంబానికి సంబంధం ఏమైనా ఉందా..?

Unrelated images passed off as cash, jewellery seized during raids at Lalu Prasad Yadav’s house. రైల్వే కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడుల సందర్భంగా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 March 2023 1:46 PM GMT
FactCheck : ఆ వీడియోలు, ఫోటోలకు లాలూ ప్రసాద్ కుటుంబానికి సంబంధం ఏమైనా ఉందా..?

రైల్వే కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడుల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఖాతాలో లేని నగదు, ఆభరణాలను చూపుతున్నట్లు సోషల్ మీడియా వినియోగదారులు కొన్ని ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఆ ఫోటో లలో కోట్ల విలువ చేసే నగదు, బంగారం ఉండడాన్ని మనం చూడవచ్చు.




మార్చి 10న, ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యుల ఇళ్లపై ఈడీ దాడులు జరిపింది. 24 చోట్ల సోదాలు నిర్వహించింది. మార్చి 11న రియల్ ఎస్టేట్, ఇతర రంగాలలో లాలూ ప్రసాద్ కుటుంబం తరపున జరిగిన మోసాలను వెలికితీసేందుకు దర్యాప్తు నిర్వహించారు. 600 కోట్ల రూపాయల అవకతవకలు చోటు చేసుకున్నాయని ఈడీ ఆరోపిస్తోంది.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టులు రెండు ఫోటోలు నిజమేనని.. మిగిలిన మూడు సంబంధం లేనివి అని NewsMeter కనుగొంది.

చిత్రం 1

మొదటి ఫోటో రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా.. మేము దానిని 11 సెప్టెంబర్ 2022 నుండి హిందుస్తాన్ టైమ్స్ రిపోర్ట్‌లో కనుగొన్నాము. ఈడీ దాదాపు 18 కోట్లు మొబైల్ గేమింగ్ అప్లికేషన్‌కు సంబంధించిన మనీలాండరింగ్ విచారణలో పట్టుకుంది. కోల్‌కతాలోని ఆరు ప్రదేశాలలో దాడులు నిర్వహించి ఈ నగదును స్వాధీనం చేసుకుంది.

కోవిడ్ -19 మహమ్మారి సమయంలో మొబైల్ అప్లికేషన్ ఎక్కువగా ఉపయోగించారు. చాలా మందిని మోసగించారు. నైరుతి కోల్‌కతాలోని గార్డెన్ రీచ్‌లోని నేసర్ అహ్మద్ ఖాన్ ఇంటిపై దాడులు జరిపి ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.



చిత్రాలు 2 & 5

రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించగా.. మార్చి 6న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారిక హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేసిన రెండవ, ఐదవ చిత్రాలను మేము కనుగొన్నాము. పంకజ్ మెహాదియా, లోకేశ్, కాథిక్ జైన్ చేసిన మోసానికి సంబంధించి నాగ్‌పూర్, ముంబైలోని 15 ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో రూ.5.51 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.1.21 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.

చిత్రాలు 3 & 5

మూడు, ఐదవ చిత్రాల రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. రెండు ఫోటోలను కలిగి ఉన్న వార్తా సంస్థ ANI ద్వారా 11 మార్చి ట్వీట్‌కు దారితీసింది. ట్వీట్ ప్రకారం, ఉద్యోగాల కుంభకోణం కోసం ఈడీ 24 ప్రదేశాలలో సోదాలు నిర్వహించగా, ఖాతాలో లేని నగదు, ఆభరణాలు రికవరీ చేసినట్లు చిత్రాలు చూపిస్తున్నాయి.

ఆరోపించిన ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణానికి సంబంధించి ఇటీవల జరిగిన ED దాడులకు సంబంధించిన రెండు చిత్రాలు మాత్రమే సరైనవి. మిగిలిన మూడు లాలూ కుటుంబానికి సంబంధం లేదని మేము నిర్ధారించాము. లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంలో సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న నగదు, నగలకు సంబంధించి వైరల్ అవుతున్న ఐదు ఫోటోలు ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉంది.

- Credits : Md Mahfooz Alam


Claim Review:ఆ వీడియోలు, ఫోటోలకు లాలూ ప్రసాద్ కుటుంబానికి సంబంధం ఏమైనా ఉందా..?
Claimed By:Socialmedia Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:Misleading
Next Story