Fact Check : షారుఖ్ ఖాన్ ఇంటికి ట్విట్టర్ సీఈవో ఇటీవల వెళ్లాడా..?

Twitter CEO did not meet SRK at Mannat Post Aryan Khans Arrest. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో భాగంగా అధికారుల విచారణలో ఉన్నారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Oct 2021 3:18 PM GMT
Fact Check : షారుఖ్ ఖాన్ ఇంటికి ట్విట్టర్ సీఈవో ఇటీవల వెళ్లాడా..?

షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో భాగంగా అధికారుల విచారణలో ఉన్నారు. అందుకు సంబంధించిన పలు పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. షారుఖ్ ఖాన్ మరియు ట్విట్టర్ CEO జాక్ డోర్సే కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్యన్ ఖాన్ అరెస్టు తర్వాత వీరిద్దరూ కలుసుకున్నారని సోషల్ మీడియా యూజర్లు తెలిపారు.

ఒక చిత్రం ఇద్దరూ కలిసి ఉన్నట్లు చూపిస్తుంది.. మరొకటి ముంబై లోని షారుఖ్ నివాసం మన్నత్‌ ను చూపుతుంది. ఖాన్‌ను ఉద్దేశించి డోర్సే రాసిన ట్వీట్‌ వైరల్ అవుతోంది. ట్విట్టర్‌లో 'భక్తులు' షారుఖ్ ని బహిష్కరిస్తుండగా, ట్విట్టర్ CEO జాక్ డోర్సే మన్నత్ లో షారుఖ్ ను కలుసుకున్నారని నెటిజన్లు ట్వీట్లలో పేర్కొన్నారు.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

న్యూస్ మీటర్ అడ్వాన్స్డ్ ట్విట్టర్ సెర్చ్ ను నిర్వహించింది. అదే చిత్రాలను షారుఖ్ మరియు డోర్సే నవంబర్ 2018 లో పోస్ట్ చేసినట్లు కనుగొన్నాము. నవంబర్ 14, 2018 న, డోర్సే మన్నత్ చిత్రాన్ని "నాక్-నాక్" టెక్స్ట్‌తో పోస్ట్ చేసారు. నవంబర్ 15, 2018 న షారుఖ్ ఖాన్ ఇద్దరి చిత్రాన్ని పోస్ట్ చేశారు.

"Today @jack made me realize with his calm demeanor & composed nearly meditative mindset... 'that all Work and no Pray, would make Jack a dull boy'. Thx for dropping in & also team @Twitter for a lively evening. Have a happy stay in India." అంటూ అప్పట్లో షారుఖ్ ఖాన్ పోస్టు పెట్టడం చూడొచ్చు.

New Indian Express, Hindustan Times లాంటి మీడియా సంస్థలు అప్పట్లోనే ఈ మీటింగ్ కు సంబంధించిన వార్తలను ప్రసారం చేయడం గమనించవచ్చు. 2018లో ట్విట్టర్ సీఈవో భారత్ పర్యటనకు వచ్చి పలువురు ప్రముఖులను కలిశాడు. అతడు కలిసిన వ్యక్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, దలై లామా తదితరులు ఉన్నారు. అలాగే పలువురు బాలీవుడ్ ప్రముఖులను కూడా కలిశాడు.

https://www.firstpost.com/entertainment/shah-rukh-khan-twitter-ceo-jack-dorsey-banter-online-before-meeting-at-actors-mumbai-residence-5554331.html

కాబట్టి వైరల్ అవుతున్న పోస్టులు ఇప్పటివి కావు.. 2018 సంవత్సరం లోనివి.


Claim Review:షారుఖ్ ఖాన్ ఇంటికి ట్విట్టర్ సీఈవో ఇటీవల వెళ్లాడా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter Users
Claim Fact Check:False
Next Story