కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను నాజీ నియంత హిట్లర్‌తో పోలుస్తూ టైమ్ మ్యాగజైన్ కవర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ది రిటర్న్ ఆఫ్ హిస్టరీ" అనే టైటిల్ తో మ్యాగజైన్ కవర్‌పై హిట్లర్ ముఖంతో కొంత భాగాన్ని.. ట్రూడో ముఖం కలిసి ఉంచిన భాగాలను చూడొచ్చు.
ఒక X వినియోగదారు మ్యాగజైన్ కవర్‌ను షేర్ చేసారు. “Am I supposed to be shocked that the same party who forced experimental injections on the population and created a two-tier society for the “clean” and the “dirty” invited a SS Nazi and gave him a standing ovation?” నాజీలకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన విషయమై సదరు ట్విట్టర్ వినియోగదారు విమర్శలు గుప్పించారు. ప్రజలకు బలవంతంగా ఇంజెక్షన్‌లను వేసిన వ్యక్తులకు మద్దతుగా నిలబడడం నిజంగా దారుణమైన అంశమని విమర్శించారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
న్యూస్‌మీటర్ కవర్ పేజీ డిజిటల్‌గా మార్ఫింగ్ చేశారని గుర్తించాం. ట్రూడోను హిట్లర్‌తో పోల్చుతూ టైమ్ సంస్థ అటువంటి ఎడిషన్‌ను ప్రచురించలేదు.
ఫోటోను నిశితంగా పరిశీలిస్తే చిత్రం పాట్రిక్ ముల్డర్‌కు క్రెడిట్ చేశారు. రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో, రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌ను హిట్టర్‌తో పోల్చుతూ ముల్డర్ Xలో పోస్ట్ చేసిన టైమ్ మ్యాగజైన్ కవర్‌ను మేము కనుగొన్నాము.
క్యాప్షన్‌లో.. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన రోజున తాను ఈ చిత్రాన్ని క్రియేట్ చేసినట్లు ముల్డర్ పేర్కొన్నారు. టైమ్ మ్యాగజైన్ ను పోలిన కవర్ పేజీని డిజైన్ చేశానని వివరించారు. ఇది ఒరిజినల్ టైమ్ మ్యాగజైన్ కవర్ కాదని కూడా క్లారిటీ ఇచ్చాడు.
వైరల్ ఇమేజ్‌ని, ముల్డర్ సృష్టించిన చిత్రాన్ని పోల్చిచూశాం. మేము మ్యాగజైన్ ను ప్రచురించిన తేదీ, శీర్షిక, వేసుకున్న బట్టలు ఒకే విధంగా ఉన్నాయని కనుగొన్నాము. పుతిన్ ముఖాన్ని ట్రూడోతో మార్పు చేసి వైరల్ ఇమేజ్ సృష్టించారని స్పష్టంగా తెలుస్తోంది.
ఇంకా "కిడ్ ఆఫ్ ది ఇయర్" పేరుతో ఫిబ్రవరి 28-మార్చి 7, 2022 నాటి అసలైన టైమ్ మ్యాగజైన్ కవర్‌ను మేము కనుగొన్నాము. దీనికి ట్రూడో లేదా పుతిన్‌తో సంబంధం లేదు.
టైమ్ మ్యాగజైన్ మార్చి 14-మార్చి 21, 2022 నాటి “The Return of History - How Putin Shattered Europe's Dream” అనే శీర్షికతో ఒక ఎడిషన్‌ను ప్రచురించినట్లు మేము కనుగొన్నాము. ఇందులో ట్యాంక్ లోపల సైనిక సిబ్బంది ఉన్నారు.
అందువల్ల, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోను నాజీ నియంత హిట్లర్‌తో పోల్చినట్లు ఉన్న వైరల్ టైమ్ మ్యాగజైన్ కవర్ ఫోటోను మార్ఫింగ్ చేశారని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam