FactCheck : శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది భారత్ లో క్రిప్టో కరెన్సీ బ్యాన్ ను తప్పుబట్టారా.?

జనవరి 12, 2023న, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU).. Binance, Kucoin, OKX వంటి ప్రధాన విదేశీ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Jan 2024 3:02 PM GMT
FactCheck : శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది భారత్ లో క్రిప్టో కరెన్సీ బ్యాన్ ను తప్పుబట్టారా.?

జనవరి 12, 2023న, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU).. Binance, Kucoin, OKX వంటి ప్రధాన విదేశీ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల వెబ్‌సైట్‌లకు యాక్సెస్‌ను బ్లాక్ చేసింది.

మహారాష్ట్ర నుండి రాజ్యసభలో భాగమైన.. శివసేన పార్లమెంటు సభ్యురాలు ప్రియాంక చతుర్వేది వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తున్నారు. ఆమె భారతదేశం అవలంభిస్తున్న క్రిప్టో నిషేధాన్ని విమర్శించినట్లు ఆ వీడియోలో ఉంది.

"Priyanka Choudhary on Crypto Exchanges & URL Ban।

Last hope par koi toh hum sub ke hakh mai खड़ा हैं,

#cryptoban #india" అంటూ వీడియోను పోస్టు చేశారు.

భారతదేశం 9 క్రిప్టో ప్లాట్‌ఫారమ్‌లను ఎందుకు నిషేధించింది?

ఈ ప్లాట్‌ఫారమ్‌లు భారతదేశంలోని మనీలాండరింగ్ నిరోధక చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీంతో నిషేధం విధించారు. అంతకుముందు, డిసెంబర్ 28, 2023న, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ మొత్తం తొమ్మిది ఆఫ్‌షోర్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలకు షోకాజ్ నోటీసును పంపింది. Binance, Kucoin, Bittrex, Bitstamp, MEXC Global, Houbi, Kraken, gate.io, Bitfinex అనే మొత్తం 9 క్రిప్టో ప్లాట్‌ఫారమ్‌లు జనవరి 12, 2024 నుండి నిషేధాన్ని ఎదుర్కొన్నాయి.

నిజ నిర్ధారణ :

వైరల్ వీడియో 2022 నాటిది.. భారతదేశంలో ఇటీవలి క్రిప్టో ప్లాట్‌ఫారమ్ నిషేధానికి సంబంధించినది కానందున ఆ వాదన తప్పు అని NewsMeter కనుగొంది.

మేము వీడియో దిగువన Sansad TV వాటర్‌మార్క్‌ను గుర్తించాము. దీన్ని ఒక క్యూగా తీసుకుని, మేము కీవర్డ్ శోధనను నిర్వహించాము. మార్చి 29, 2022 నాటి Sansad TVకి సంబంధించిన YouTube ఛానెల్‌లో వైరల్ వీడియోను కనుగొన్నాము.

ఛానెల్ వివరణ ప్రకారం.. రాజ్యసభ బడ్జెట్ సెషన్ 2022లో చతుర్వేది విభజన బిల్లు, ఫైనాన్స్ బిల్లు గురించి చర్చిస్తున్నట్లు వీడియోలో చూపిస్తారు. ఇది రాజ్యసభ 256వ సెషన్ లో భాగం. వైరల్ క్లిప్‌ను Sansad TV వీడియో 8:13 నిమిషాల టైమ్‌స్టాంప్‌లో చూడవచ్చు.


ఈ క్లిప్‌లు ఏప్రిల్ 5, 2022న ది క్వింట్ యూట్యూబ్ ఛానెల్‌ లో కూడా అప్‌లోడ్ చేశారు.

పార్లమెంటరీ ప్రొసీడింగ్‌లో చతుర్వేది చేసిన ప్రసంగం గురించి కూడా బిజినెస్ టుడే నివేదిక చెబుతోంది. వైరల్ వీడియో పాతది. క్రిప్టో నిషేధానికి ఎటువంటి సంబంధం లేదు.

ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో క్రిప్టోకరెన్సీల చట్టపరమైన స్థితిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, అయితే క్రిప్టోకరెన్సీలపై ఫ్లాట్ 30% పన్ను, TDSని ప్రవేశపెట్టిందని చతుర్వేది ఆరోపించారు.

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్, మీడియానామా కూడా చతుర్వేది ప్రసంగాన్ని నివేదించాయి.

మేము ప్రియాంక చతుర్వేది ఇటీవల ఏవైనా ఇటీవలి స్టేట్‌మెంట్‌లను తెలుసుకోడానికి కీవర్డ్ సెర్చ్ ను కూడా అమలు చేసాము. కానీ అందుకు సంబంధించి ఎటువంటి ఫలితాలను కనుగొనలేకపోయాం. అందువల్ల, ఈ వైరల్ క్లిప్ పాతదని.. భారతదేశంలో క్రిప్టో ప్లాట్‌ఫారమ్‌లపై ఇటీవలి నిషేధానికి సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తుంది.

Credits : Sunanda Naik

Claim Review:శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది భారత్ లో క్రిప్టో కరెన్సీ బ్యాన్ ను తప్పుబట్టారా.?
Claimed By:Social Media User
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter
Claim Fact Check:False
Next Story