నిజమెంత: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణంపై విరాట్ కోహ్లీ వీడియో చేశారా?
ఆర్‌జి కర్ మెడికల్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ ను అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన తీవ్ర నిరసనలకు కారణమైంది.
By న్యూస్‌మీటర్ తెలుగు
నిజమెంత: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణంపై విరాట్ కోహ్లీ వీడియో చేశారా?
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ ను అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు కారణమైంది. ప్రజలు న్యాయం జరగాలంటూ రోడ్ల మీదకు వచ్చారు. దేశంలో మహిళలకు బలమైన భద్రతా చర్యలు తీసుకుని రావాలంటూ డిమాండ్ చేశారు.
పలువురు ప్రముఖులు కూడా దేశంలో అత్యాచారాలను ఖండిస్తూ వీడియోలను పోస్ట్ చేశారు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మహిళలపై హింసను ఖండిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. RG కర్ మెడికల్ కాలేజీలో ఇటీవల జరిగిన సంఘటనను కోహ్లీ ప్రస్తావించినట్లు వాదిస్తున్నారు.
వీడియోలో, కోహ్లి మాట్లాడుతూ.. “ఇది కలవరపెడుతోంది.. దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. అలాంటి సమాజంలో భాగమైనందుకు నేను సిగ్గుపడుతున్నాను. మనం మన ఆలోచనలను మార్చుకోవాలి.. స్త్రీ, పురుషులను ఒకే విధంగా చూడాలని నేను కోరుతూ ఉన్నాను. గౌరవప్రదంగా ఉండండి. ఇలాంటివి చేసిన వ్యక్తులు తమను తాము పురుషులు అని చెప్పుకునే హక్కు లేదు." అని చెప్పడం వినవచ్చు.
“Listen What Virat Kohli Is Telling About Dr Moumita Case And The Society We Live In.” అంటూ ఒక ఎక్స్ యూజర్ వీడియోను పోస్టు చేశారు.
నిజ నిర్ధారణ:
ఆర్.జి.కర్. మెడికల్ కాలేజీ ఘటనపై కోహ్లి ఎలాంటి వీడియో స్టేట్‌మెంట్‌ను విడుదల చేయలేదని.. ఆ వాదన తప్పు అని న్యూస్‌మీటర్ కనుగొంది. వైరల్ వీడియో 2017 నాటిది.
వీడియో కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో ఎక్స్‌టెండెడ్ వెర్షన్ ను కనుగొన్నాం. వాస్తవానికి జనవరి 6, 2017న విరాట్ కోహ్లీ X హ్యాండిల్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ పోస్ట్ చేశారని గుర్తించాం. వీడియోలో, కోహ్లీ బెంగళూరులో మహిళలపై హింస గురించి మాట్లాడాడు.
దీన్ని ఒక క్యూ గా తీసుకొని.. మేము కీవర్డ్ సెర్చ్ చేసాము. NDTV, హిందూస్తాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా.. నివేదికలు అన్నీ జనవరి 6, 2017న కథనాన్ని ప్రచురించాయి. డిసెంబర్ 31, 2016లో జరిగిన సామూహిక వేధింపుల సంఘటనపై కోహ్లీ తీవ్ర వేదనను వ్యక్తం చేసినట్లు ఈ నివేదికలు సూచిస్తున్నాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బెంగళూరులో మహిళలను వేధించారు. 2017 ఇండియా టుడే నివేదిక ప్రకారం.. నూతన సంవత్సర వేడుకల సమయంలో MG రోడ్, బ్రిగేడ్ రోడ్‌లలో మహిళలపై దాడులు చేశారు.. అసభ్యకరంగా తాకారు.
RG కర్ మెడికల్ కాలేజీలో ఇటీవల జరిగిన సంఘటనకు సంబంధించి కోహ్లీ ఏదైనా ప్రకటన జారీ చేశారా అని మేము తనిఖీ చేసాము. అయితే, మేము అతని సోషల్ మీడియా ఖాతాలలో ఎటువంటి పోస్ట్‌లు, కోహ్లీ ఈ దారుణ సంఘటనను ప్రస్తావిస్తూ చేసిన కథనాలకు సంబంధించిన మీడియా నివేదికలను కూడా కనుగొనలేదు.
అందువల్ల, వైరల్ వీడియో పాతదని గుర్తించాం. కోల్‌కతాలోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యతో తప్పుగా లింక్ చేశారని మేము నిర్ధారించాము. నిజమెంత: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణంపై విరాట్ కోహ్లీ వీడియో చేశారా?