FactCheck : ఇండోనేషియాను ఇటీవల తాకిన భూకంపానికి సంబంధించిన శాటిలైట్ విజువల్స్ ఇవేనా..?
This video does not show satellite images of recent earthquake that hit Indonesia. నవంబర్ 21న, ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావాలో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
నవంబర్ 21న, ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావాలో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. పిల్లలతో సహా 271 మంది మరణించినట్లు సమాచారం. అనేక మంది గల్లంతయ్యారు. వందల మంది గాయపడ్డారు.
ఈ విపత్తు తరువాత, విధ్వంసానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను చూపించే టైమ్-లాప్స్ వీడియో వైరల్ అయింది. ఇది నవంబర్ 21 న ఇండోనేషియాను తాకిన భూకంపానికి సంబంధించిన వీడియో అని తేలింది.
ట్విట్టర్ యూజర్లు "Satellite image of earthquake taking place in Indonesia. No escape for those caught in the active earthquake zone. Everything destroyed in the path of the earthquake." అంటూ పోస్టులు పెడుతున్నారు.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం వీడియో కీఫ్రేమ్స్ కు సంబంధించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించింది. CNN ద్వారా 2018 కథనంలో అదే ఉపగ్రహ చిత్రాలను కనుగొంది. ఇండోనేషియాలో ఘోరమైన భూకంపం సునామీ తర్వాత, ఉపగ్రహ చిత్రాలు ప్రభావిత ప్రాంతాలను చూపించాయని.. ఒక వంతెన కూడా కొట్టుకుపోయినట్లు కథనాల్లో పేర్కొన్నారు. ఈ భూకంపం సునామీకి కారణమైందని కూడా పేర్కొంది.
2 అక్టోబర్ 2018న, CNN తన Facebook పేజీలో అదే ఉపగ్రహ చిత్రాలను చూపించే వీడియోను పోస్ట్ చేసింది. "ఉపగ్రహ చిత్రాలు ఇండోనేషియా భూకంప విధ్వంసాన్ని చూపుతున్నాయి" "Satellite images show Indonesia's earthquake devastation." అనే శీర్షికతో వీడియో ఉంది.
9 అక్టోబర్ 2018న అసోసియేటెడ్ ప్రెస్ ప్రచురించిన కథనంలో కూడా మేము అదే ఉపగ్రహ చిత్రాలను కనుగొన్నాము. 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం సునామీ వచ్చేలా చేయడమే కాకుండా మొత్తం పరిసరాలను మింగేసిందని పేర్కొంది.
మేము 8 అక్టోబర్ 2018న YouTubeలో అప్‌లోడ్ చేయబడిన వైరల్ టైమ్-లాప్స్ వీడియోను కూడా కనుగొన్నాము. దీని శీర్షిక " It is titled "Crazy! Satellite Timelapse Shows Liquefaction During Indonesia Earthquake." అని ఉంది.
Proses likuifaksi tanah di Kota Palu hasil rekaman citra Satelit WorldView resolusi pixel 0.5 meter. Rumah dan bangunan terseret oleh lumpur yang muncul akibat gempa dan menenggelamkannya. Tim SAR terus bekerja melakukan evakuasi di daerah ini. Korban terus ditemukan. pic.twitter.com/G3Ki40tdmA
వైరల్ వీడియో 2018చెందినదని స్పష్టంగా తెలుస్తోంది. ఇది 21 నవంబర్ 2022 భూకంపానికి సంబంధించినది కాదు. వైరల్ అవుతున్న వార్తలు.. ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి.
Claim Review:ఇండోనేషియాను ఇటీవల తాకిన భూకంపానికి సంబంధించిన శాటిలైట్ విజువల్స్ ఇవేనా..?