సోషల్ మీడియా వినియోగదారులు 2020 గాల్వాన్ ఘర్షణలో మరణించిన చైనా సైనికుల శవ పేటికలకు సంబంధించిన ఫోటోలు ఇవే అంటూ పోస్టులు షేర్ చేస్తున్నారు.
చాలా మంది ట్విటర్ యూజర్లు ఈ ఫోటోను షేర్ చేస్తూ, "ఈరోజు ఆన్‌లైన్‌లో గాల్వాన్ ఘర్షణలో చనిపోయిన చైనీస్ సైనికుల ఫోటోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఆర్మీకి సంబంధించిన ఏ సంఘటన కూడా ఇలా జరగలేదు. వీరు జవాన్లు కాదని, అధికారుల స్థాయి వారని గుర్తుంచుకోండి" అని రాశారు. గాల్వాన్ ఘటనలో చనిపోయింది చైనీస్ అధికారులని.. సాధారణ పౌరులు కాదని పలువురు చెబుతూ వస్తున్నారు.
అదే క్లెయిమ్‌తో ఫేస్‌బుక్ వినియోగదారులు కూడా ఫోటోను షేర్ చేశారు.
15 జూన్ 2020న, లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీలో భారత్- చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది, ఇందులో 20 మంది భారతీయ సైనికులు మరణించారు.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి, 2010లో chinanews.com ప్రచురించిన నివేదికలో ఫోటోను కనుగొంది. సిచువాన్ ప్రావిన్స్‌లోని డాఫూ కౌంటీలో అగ్నిప్రమాదంలో మరణించిన 15 మంది అమరవీరులకు చెందిన శవపేటికలు ఇవని.. అదే ఈ ఫోటోలో ఉందని పేర్కొంది. మృతదేహాలను ప్రజల సంతాప కార్యక్రమాల కోసం కాంగ్డింగ్ వ్యాయామశాలలో ఉంచారు.
2010లో మరో చైనీస్ వెబ్‌సైట్ ప్రచురించిన నివేదికలో కూడా మేము ఫోటోను కనుగొన్నాము. 9 డిసెంబర్ 2010న, కాంగ్డింగ్‌లో అమరవీరుల స్మారక సదస్సు నిర్వహించారు. దీనికి అధికారులు, సైన్యం, స్థానిక ప్రజలు, అమరవీరుల కుటుంబాలు, సైనికులతో సహా 700 మందికి పైగా హాజరయ్యారు. .
చివరగా, మేము ఒక కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. టిబెట్ యొక్క సిచువాన్ ప్రావిన్స్‌లో భారీ గడ్డి మైదానంలో అగ్నిప్రమాదం గురించి డిసెంబర్ 2010 లో అనేక వార్తా నివేదికలను కనుగొన్నాము. రెస్క్యూ ఆపరేషన్‌లో 15 మంది సైనికులు, గడ్డి భూములలో పని చేసే ఇద్దరు కార్మికులు, మరో ఐదుగురు స్థానిక పౌరులతో సహా 22 మంది మరణించారని నివేదికలు తెలిపాయి.
మరణించిన చైనా సైనికుల ఫోటో 2010 నాటిదని స్పష్టంగా తెలుస్తోంది. గాల్వాన్ ఘర్షణ 2020లో జరిగింది. ఈ వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిలా ఉంది.