నిజమెంత: ట్రాక్టర్ కింద ఓ వ్యక్తి నలిగిపోతున్న వీడియో ప్రస్తుతం జరుగుతున్న రైతుల నిరసనలకు సంబంధించినదా?

తమ పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు “ఢిల్లీ చలో” పాదయాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ట్రాక్టర్-ట్రైర్ కింద నలిగిపోతున్న వీడియో వైరలవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Feb 2024 6:20 AM GMT
FarmersProtest2024, Oldvideo, Factcheck, Farmerdied2023Protest

నిజమెంత: ట్రాక్టర్ కింద ఓ వ్యక్తి నలిగిపోతున్న వీడియో ప్రస్తుతం జరుగుతున్న రైతుల నిరసనలకు సంబంధించినదా? 

తమ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు “ఢిల్లీ చలో” పాదయాత్రను ప్రారంభించారు. ఫిబ్రవరి 13న పంజాబ్, హర్యానా మధ్య శంభు సరిహద్దు దాటే ప్రయత్నాన్ని రైతులు చేశారు. ఆ సమయంలో హర్యానా పోలీసులతో ఘర్షణ కూడా జరిగింది. అయితే ఒక వ్యక్తి ఒక ట్రాక్టర్-ట్రైర్ కింద నలిగిపోతున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. పోలీసులతో రైతుల ఘర్షణకు సంబంధించిందనే వాదనతో X లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

‘ఖలిస్థానీ ఉగ్రవాదులు, ట్రాక్టర్ తో హర్యానా పోలీసులపై దాడి చేశారు, ఆ తర్వాత మృతదేహాన్ని 50 మీటర్లు ఈడ్చుకెళ్లారని’ క్యాప్షన్‌తో వీడియో షేర్ చేస్తున్నారు. హత్యలకు కుట్ర చేస్తున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా ఉందని అందులో తెలిపారు.

అదే వీడియోను షేర్ చేసిన మరో వినియోగదారు.. రైతులు పోలీసులను ట్రాక్టర్ కిందకు నెట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.

నిజ నిర్ధారణ:

వైరల్ వీడియో పాతది.. ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల నిరసనతో ఎలాంటి సంబంధం లేదని మేము గుర్తించాం. ఈ వాదనలో ఎలాంటి నిజం లేదని NewsMeter కనుగొంది.

విజువల్స్‌ను జాగ్రత్తగా విశ్లేషించగా.. మేము వీడియోలో X వినియోగదారు "గగన్‌దీప్ సింగ్" వాటర్‌మార్క్‌ని గమనించాము. దీన్ని ఒక క్యూగా తీసుకొని, మేము గగన్‌దీప్ సింగ్ X హ్యాండిల్‌ని వెతికాం. అదే వీడియోను ఆగస్ట్ 21, 2023న పోస్ట్ చేసినట్లు గుర్తించాం.

ఈ వీడియోను “సంగ్రూర్ గ్రామం లాంగోవాల్‌లో రైతులు, పంజాబ్ పోలీసులు నిరసనలో పాల్గొనడానికి చండీగఢ్ వైపు వెళుతుండగా వారి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ సమయంలో, ఒక రైతు ట్రాక్టర్ ట్రాలీ టైర్ కిందకు పడిపోయాడు.. అతడికి చికిత్స అందిస్తూ ఉండగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో ఒక పోలీసు తీవ్రంగా గాయపడ్డాడు." అని అన్నారు.

ఆగష్టు 21, 2023న స్థానిక వార్తా వెబ్‌సైట్ PTC న్యూస్ ప్రచురించిన నివేదికలో మేము వీడియోకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా కనుగొన్నాము. నివేదిక ప్రకారం, పంజాబ్‌లోని లాంగోవాల్ గ్రామంలో రైతులు చండీగఢ్ వైపు వెళుతుండగా పోలీసులతో ఘర్షణ జరిగింది. ప్రీతమ్ సింగ్ అనే 70 ఏళ్ల వ్యక్తి తొక్కిసలాట వంటి పరిస్థితిలో ట్రాక్టర్ కిందకు నలిగిపోవడంతో మరణించాడని అందులో తెలిపారు.

ఇదే సంఘటనను టైమ్స్ నౌ, ఔట్‌లుక్, ది వైర్.. అనేక ఇతర ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు ఆగస్టు 2023లో కవర్ చేశాయి.

అంతేకాకుండా, అదే విజువల్‌ని ది మిర్రర్, ది ట్రిబ్యూన్ కు సంబంధించిన యూట్యూబ్ ఛానెల్‌స్ లో అవే వివరాలతో అప్‌లోడ్ చేసినట్లు కూడా మేము కనుగొన్నాము.

ఆగస్ట్ 21, 2023 న, సంగ్రూర్ పోలీసులు కూడా సంఘటనకు సంబంధించిన దృశ్యాలను ట్వీట్ చేశారు. నిరసన సమయంలో మరణించిన వ్యక్తికి తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. “ఈరోజు లాంగోవాల్‌లో ఒక నిరసనకారుడు దురదృష్టవశాత్తు మరణించాడు, వేగంగా ఓ ట్రాక్టర్ ను నడపడంతో ఆ వ్యక్తి ట్రాలీ కింద నలిగిపోయాడు. ఈ ఘటనలో ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మరణించిన వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం" అని ట్వీట్ చేశారు.

కాబట్టి, ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆందోళనలకు.. ట్రాక్టర్ కింద నలిగిపోతున్న వ్యక్తికి సంబంధించిన వీడియోకు ఎలాంటి సంబంధం లేదు.

Credits: Sunanda Naik

Next Story