FactCheck: ఏపీలో కుక్కలు, పందులకు లైసెన్స్ ఉండాలనే నిబంధన కొత్తది కాదు
The requirement to have a license for dogs and pigs in AP is not new. ''ఏపీ ప్రభుత్వం మరో విచిత్రమైన జీవో తెచ్చింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
By Nellutla Kavitha Published on 5 Jan 2023 7:30 PM IST''ఏపీ ప్రభుత్వం మరో విచిత్రమైన జీవో తెచ్చింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ - కుక్కలు, పందులకు లైసెన్సులు ఉండాలంటూ ఉత్తర్వులు విడుదల చేసింది'' అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఒకవేళ లైసెన్సు లేని కుక్కలు, పందులను అధికారులు పట్టుకుంటే వాటి యజమానులు జరిమానా కట్టాలని, లేకుంటే వాటిని వీధి కుక్కలు / పందులుగా భావించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలని జీవోలో ఉంది" అనే వీడియోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదే వీడియో మరొక ఇంస్టాగ్రామ్ ఎకౌంట్లో కూడా కనిపించింది. వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
నిజ నిర్ధారణ
వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న ఈ పోస్టులో నిజమెంత?! ఫాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. ఇన్స్టా లో పోస్ట్ అయిన వీడియోని పరిశీలించి చూసినప్పుడు, అది TV5 న్యూస్ ఛానల్ లో వచ్చినట్టుగా కనిపించింది. దీంతో గూగుల్ కీవర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు, ఈ వార్తను tv5 Dec 30, 2020 రోజున యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్లు గా కనిపించింది. https://www.youtube.com/watch?v=C8voDCDb48w
ఇక ఈ వీడియోలో చెప్పినట్టుగా G.O.Ms.NO. 693 గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేసినప్పుడు, Dec 29, 2020 రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసినట్టు కనిపించింది. అయితే గతంలోనే, అంటే 1996లో జారీ చేసిన నిబంధనలను మారుస్తున్నట్టుగా ఇందులో ఉంది. https://drive.google.com/file/d/16NeO0HzF80RlBfaV7ToAKg2ENJpiaUlZ/view
గతంలో వచ్చిన ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం గ్రామాలు, మునిసిపాలిటీల పరిధిలో ఉండే లైసెన్సు లేని వీధి కుక్కలు / పందులని స్వాధీనం చేసుకోవచ్చని ఉంది. అయితే వాటిని ఇప్పుడు పెట్స్ యజమానుదారులు పట్టించుకోకపోవడం వల్ల లైసెన్సు తప్పనిసరి చేయడంతో పాటుగా జరిమానాను కూడా పెంచారు. ఇందుకు సంబంధించి గతంలో, Sep 28, 2013 సాక్షిలో వచ్చిన https://www.sakshi.com/news/andhra-pradesh/license-must-for-pet-dogs-68893
Jan 25, 2014 రోజు V6 News లో వచ్చిన https://youtu.be/xelOL1qJ1mA వచ్చిన వార్తా కథనాలను ఇక్కడ చూడవచ్చు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, నగరాల్లో కూడా ఈ విధానం అమలు చేస్తున్నారు. అస్సాం ప్రభుత్వం రూపొందించిన విధి, విధానాలను ఇక్కడ చూడవచ్చు.
https://gmc.assam.gov.in/portlet-innerpage/registration-of-pet-dogs
Aug 19, 2016 రోజు Hindustan Times ఢిల్లీలో అమలవుతున్న విధానం గురించి ప్రచురించింది.
ఇక The Sunday Guardian కూడా Nov 30, 2019 రోజున మనదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను వివరిస్తూ ఒక ఆర్టికల్ ప్రచురించింది.
https://www.sundayguardianlive.com/lifestyle/important-get-pets-registered
సో, ఏపీలో పెంపుడు కుక్కలు, పందులకు లైసెన్సు ఉండాలనే నిబంధన కొత్తగా తెచ్చినది కాదు, ఎప్పటి నుంచో అమల్లో ఉంది.