ఇండియన్ ముస్లిం ఫౌండేషన్ ఛైర్మన్, జాతీయ ప్రతినిధి షోయబ్ జమై ఒక ట్వీట్‌లో దక్షిణ భారత నటి సంజనా గల్రానీ ‘ది కేరళ స్టోరీ’ సినిమా చూసిన తర్వాత ఇస్లాం మతాన్ని స్వీకరించి ముస్లిం వ్యక్తి అజీజ్ పాషాను వివాహం చేసుకున్నారని పేర్కొన్నారు. నటి హజ్ తీర్థయాత్ర కోసం సౌదీ అరేబియాకు వెళ్లిందని, ఆమె ప్రశాంతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నదని చెప్పారు.
'ది కేరళ స్టోరీ'లో సహనటి దేవోలీనా భట్టాచార్జీ, షాహన్వాజ్ షేక్‌ను పెళ్లి చేసుకోవడం తన జీవితంలో అత్యుత్తమ నిర్ణయమని, తాను సంతోషంగా ఉన్నానని జమై పేర్కొన్నారు.
సంజ్జనా గల్రానీ, ఆమె కుటుంబానికి సంబంధించిన చిత్రాలను ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఇతర మీడియా సంస్థలకు సంబంధించిన వార్తల క్లిప్పింగ్‌ల స్క్రీన్‌షాట్‌లను కూడా పంచుకున్నారు. సంజనా గల్రానీ బుజ్జిగాడు సినిమా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుంది. పలు సినిమాల్లో నటించింది.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ వైరల్ వాదనను తప్పు అని గుర్తించింది. సంజ్జనా గల్రానీ 2018లో అజీజ్ పాషాను వివాహం చేసుకున్నారు. ‘ది కేరళ స్టోరీ’లో దేవోలీనా భట్టాచార్జీ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నారనే వాదనలో ఎటువంటి నిజం లేదు.
మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. 17 మే 2023న ప్రచురించిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదికను కనుగొన్నాము. సంజ్జనా హిందూ కుటుంబంలో జన్మించారని.. కొన్ని సంవత్సరాల క్రితం ఇస్లాం మతంలోకి మారారని పేర్కొంది. అజీజ్ పాషా అనే వైద్యుడ్ని ఆమె పెళ్లి చేసుకుంది
సంజనా ఇటీవల తన మక్కా యాత్ర గురించి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్‌ను చేసింది. ఆమె హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి మారడాన్ని కొందరు విమర్శించారు.
మేము 18 సెప్టెంబరు 2020లో వచ్చిన ఏషియానెట్ నివేదికను కూడా కనుగొన్నాము. అక్టోబర్ 9, 2018 నాటి అఫిడవిట్‌ను మేము చూశాం. ఇందులో “మిస్ అర్చన మనోహర్ గల్రానీ ఇకపై ఆమె కొత్త పేరు మిస్ మహీరా అని పిలువబడుతుంది” అని ఉంది. ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించడానికి ఎటువంటి ఒత్తిడి లేదని.. తన ఇష్టంతో ఇస్లాంను స్వీకరించిందని పేర్కొన్నారు.
సంజ్జనా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను తనిఖీ చేయగా ఆమె ఫ్యామిలీ ఫోటో మే 23న పోస్ట్ చేసిందని మేము కనుగొన్నాము.
టీవీ నటి దేవోలీనా భట్టాచార్జీ ‘ది కేరళ స్టోరీ’లో నటించిందన్న వాదనను న్యూస్‌మీటర్ ఇప్పటికే తోసిపుచ్చింది.
‘ది కేరళ స్టోరీ’ చూసిన తర్వాత సంజ్జనా గల్రానీ ఇస్లాం మతంలోకి మారారని వస్తున్న వాదనలు అవాస్తవమని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam