ప్రముఖ సింగర్‌కు 10 రూపాయల జరిమానా విధించిన కోర్టు
ప్రముఖ నేపథ్య గాయకుడు ఉదిత్ నారాయణ్ ఝాకు సుపాల్ కుటుంబ న్యాయస్థానం 10 రూపాయల జరిమానా విధించింది.
By Kalasani Durgapraveen Published on 17 Dec 2024 12:47 PM IST
ప్రముఖ నేపథ్య గాయకుడు ఉదిత్ నారాయణ్ ఝాకు సుపాల్ కుటుంబ న్యాయస్థానం 10 రూపాయల జరిమానా విధించింది. ఇది కాకుండా షెడ్యూల్ తేదీకి ఉదిత్ నారాయణ్ ఝా.. అతని న్యాయవాది గైర్హాజరు కావడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తమైంది. రంజనా నారాయణ్ ఝా 2020 సంవత్సరంలో సుపాల్‌లోని కుటుంబ న్యాయస్థానంలో ఉదిత్ నారాయణ్ ఝాపై ఫిర్యాదు చేశారు. దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరిగింది. అయితే ఉదిత్ నారాయణ్ ఝా మరియు అతని లాయర్ ఇద్దరూ కోర్టుకు హాజరు కాలేదు. ఆ తర్వాత కుటుంబ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రాహుల్ ఉపాధ్యాయ కౌంటర్ దాఖలు చేయడానికి తదుపరి తేదీని ఉదిత్ నారాయణ్ ఝాకు ఇచ్చారు.
ప్రముఖ నేపథ్య గాయకుడు ఉదిత్ నారాయణ్ ఝా భార్య రంజనా నారాయణ్ ఝా తమ వైవాహిక జీవితాన్ని పునరుద్ధరించేందుకు 2020లో తన భర్త ఉదిత్ నారాయణ్ ఝాపై దావా వేసినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది అజయ్ సింగ్ తెలిపారు. వీరి తుది విచారణ ఈరోజు జరగాల్సి ఉంది. కానీ ఉదిత్ నారాయణ్ ఝా హాజరుకాలేదు.. సమాధానం కూడా దాఖలు చేయలేదు. దీంతో కుటుంబ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రాహుల్ ఉపాధ్యాయ ఉదిత్ నారాయణ్ ఝాకు రూ. 10 జరిమానా విధించారు. జనవరి 28న కౌంటర్ దాఖలు చేయడానికి చివరి అవకాశం ఇచ్చారు.
కోర్టుపై తనకు పూర్తి నమ్మకం ఉందని రంజన నారాయణ్ ఝా అన్నారు. కోర్టు తనకు భార్య హక్కులు ఇస్తుందన్న పూర్తి నమ్మకం ఉంది. ఉదిత్ జీతో కలిసి జీవించాలనుకుంటున్నట్లు చెప్పింది. ఆమె ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఉదిత్ జీతో కలిసి జీవించాలనుకుంటోంది. అయితే, ఉదిత్ జీ నుంచి కేవలం హామీ మాత్రమే అందింది. ఉదిత్ జీ మళ్లీ గ్రామానికి వచ్చి ఒక కమిట్మెంట్ చేసి వెళ్లిపోతాడు. మేము ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా నన్ను వెంటనే తమతో తీసుకువెళతానని హామీ ఇచ్చారు. కానీ తీసుకెళ్లలేదు. ముంబైలో మరో మహిళతో నివసిస్తున్నాడని ఆమె ఆరోపిస్తుంది. తనకు ఉదిత్ నారాయణ్ ఝాతో 1984లో వివాహమైందని రంజనా తెలిపారు. నేను ఉదిత్ నారాయణ్ మొదటి భార్య.. అతనితో నివసించే పూర్తి హక్కు ఉందని పేర్కొంది. కానీ నేను ముంబైకి వెళితే.. గూండాలు నన్ను వెంబడిస్తారు. అటువంటి పరిస్థితిలో.. నాకు న్యాయం జరుగుతుందని కోర్టుపై మాత్రమే నమ్మకం పెట్టుకున్నాను. నేను కోర్టు నుండి న్యాయం ఆశిస్తున్నానని పేర్కొంది.