రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన వ్యాఖ్యలు అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. "రాహుల్ గాంధీ భారతదేశానికి భవిష్యత్తు నాయకుడు, అతనిని తేలికగా తీసుకుంటే చాలా ప్రమాదం. అతని కుటుంబ చరిత్రని చూడండి.. అతడిని తేలికగా తీసుకోవడం చాలా పెద్ద తప్పు" (హిందీ నుండి అనువదించబడింది) అని చెప్పినట్లుగా అందులో ఉంది.
ఇలాంటి పోస్ట్‌లను వీక్షించడానికి ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి.
నిజ నిర్ధారణ:
NewsMeter బృందం రాహుల్ గాంధీపై మోహన్ భగవత్ చేసిన ప్రకటన గురించి కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. అయితే వైరల్ పోస్టులను ధృవీకరించే వార్తా నివేదిక ఏదీ కనుగొనబడలేదు. మేము మోహన్ భగవత్, RSSల ధృవీకరించబడిన ట్విట్టర్ హ్యాండిల్‌ను కూడా తనిఖీ చేసాము, కానీ అలాంటి ప్రకటన ఏదీ కనుగొనబడలేదు.
మేము వైరల్ పోస్ట్‌లలో ఒకదానికి సంబంధించి మోహన్ భగవత్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. 18 సెప్టెంబర్ 2018 న టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనంలో ఉపయోగించిన అదే ఫోటోను మేము కనుగొన్నాము. ఈ కథనం 'The Future of Bharat: An RSS Perspective' అనే ఈవెంట్ కు సంబంధించినది.
ఈ కార్యక్రమంలో భగవత్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పెద్ద పాత్ర పోషించిందని, భారతదేశానికి ఎందరో మహానుభావులను అందించిందని, వారిలో కొందరు ఇప్పటికీ మనకు మార్గదర్శక శక్తిగా ఉన్నారని అన్నారు. అయితే, రాహుల్ గాంధీపై భగవత్ చేసిన ప్రశంసలు లేదా ప్రకటన మాకు కనిపించలేదు.
ఈవెంట్ కు సంబంధించి భగవత్ పూర్తి ప్రసంగానికి చెందిన వీడియోను కూడా మేము కనుగొన్నాము. ఆయన రాహుల్ గాంధీ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.