బ్రిటన్ కు కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి రిషి సునక్ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రశంసించారని చెబుతూ ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. హిందీ వార్తాపత్రిక దైనిక్ భాస్కర్‌కి చెందిన గ్రాఫిక్ సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారు.
గ్రాఫిక్ ఫోటోలో సునక్, మన్మోహన్ సింగ్‌ల ఫోటోలు ఉన్నాయి. "భారతదేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లడానికి మరియు క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి భారతదేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యం అవసరం" అని టెక్స్ట్ ఉంది.
అనేక మంది ఫేస్‌బుక్, ట్విట్టర్ వినియోగదారులు వేర్వేరు శీర్షికలతో పోస్ట్‌ను తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పంచుకున్నారు.
నిజ నిర్ధారణ :
సునక్.. మన్మోహన్ సింగ్‌ను ప్రశంసించారని తెలుసుకోడానికి వార్తా నివేదికలను కనుగొనడానికి NewsMeter బృందం కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది, కానీ మీడియా ద్వారా నివేదించబడిన అటువంటి వార్తలేవీ కనుగొనబడలేదు. భారతదేశ మాజీ ప్రధాని గురించి UK ప్రధాని అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, మీడియా దానిని నివేదించేది.
అంతేకాకుండా ఇందుకు సంబంధించి మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. అక్టోబర్ 25న దైనిక్ భాస్కర్ యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన గ్రాఫిక్‌ని మేము కనుగొన్నాము. గ్రాఫిక్‌లోని టెక్స్ట్ వైరల్ ఇమేజ్ కు భిన్నంగా ఉంటుంది. ఒరిజినల్ టెక్స్ట్ లో चिदंबरम-थरूर की सलाह, भारत में भी हो अल्पसंख्यक PM:भाजपा बोली- मनमोहन सिंह को भूल गए, जानें पूरा मामला అని ఉంది.
అక్టోబర్ 28న, దైనిక్ భాస్కర్ ఒక ట్వీట్‌లో నకిలీ గ్రాఫిక్‌ను ఫేక్ అని కొట్టిపారేసింది.
కాబట్టి వైరల్ ఇమేజీని ఎడిట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.