తెలంగాణలోని వరంగల్‌లో ఓ ముస్లిం వ్యక్తి గులాబ్ జామూన్ లాంటి పదార్థంపై మూత్ర విసర్జన చేశారనే వాదనతో వీడియో వైరల్‌గా మారింది.
"వరంగల్, తెలంగాణ: ముస్లింలు నడుపుతున్న హోటల్‌లో ఆహారం మీద మూత్ర విసర్జన చేస్తున్నారు" అనే శీర్షికతో ఒక X వినియోగదారు వీడియోను షేర్ చేశారు.
పలువురు సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని న్యూస్ మీటర్ కనుగొంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా “What is the name of this #जिहाद after food jihad?” అనే వాదనతో 2022లో పోస్ట్ చేసిన X వీడియోకు దారితీసింది.
దీన్ని బట్టి.. ఈ వీడియో ఇటీవలిది కాదని మనకు అర్థం అవుతుంది.
మా పరిశోధనలో నిడివి ఎక్కువ ఉన్న వీడియోను కూడా మేము కనుగొన్నాం.
17-సెకన్ల వీడియోలో, ఆ వ్యక్తి ఆహరం మీదకు బాటిల్‌తో ఓ ద్రవాన్ని వేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ వీడియో ప్రాంక్ అని మనకు అర్థమవుతుంది.
వీడియోలో ‘ashiq.billota’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ లోగో ఉన్నప్పటికీ, ఆ పేజీ ప్రస్తుతం అందుబాటులో లేదు.
వరంగల్‌లో ముస్లిం సమాజానికి సంబంధించి విశ్వసనీయమైన న్యూస్ పోర్టల్‌లు ఇలాంటి సంఘటనను నివేదించలేదు. జూలై 19 న, నాంపల్లి నియోజకవర్గం నుండి AIMIM ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని వైరల్ వీడియోకు సంబంధించి అసదుద్దీన్ ఒవైసీ సూచనల మేరకు ఫిర్యాదు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
న్యూస్‌మీటర్ ఈ వీడియో మూలాన్ని స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ.. ఈ వీడియో ప్రాంక్ అని స్పష్టంగా తెలుస్తుంది.నిజమెంత: తెలంగాణలోని వరంగల్ లో ఓ రెస్టారెంట్ లో మూత్రం పోసిన ఆహారపదార్థాలను వండుతున్నారనే వాదనలో నిజం లేదు