Fact Check : పాండిచ్చేరి యూనివర్సిటీ విద్యార్థి కరోనా మహమ్మారికి ఇంట్లోనే చికిత్స కనుక్కున్నాడా..?

fact check of Pondicherry University student home remedy for covid 19. పాండిచ్చేరి యూనివర్సిటీకి చెందిన ఓ యువకుడు కరోనా మహమ్మారికి విరుగుడు కనుక్కున్నాడని

By Medi Samrat  Published on  14 May 2021 4:14 AM GMT
fact check of corona home remedy

భారతదేశాన్ని ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ పట్టి పీడిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఓ వైపు వ్యాక్సిన్ కొరత పట్టి పీడిస్తూ ఉండగా.. మరో వైపు ఎన్నో వదంతులను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. కొన్నింటిని పాటించాలని.. వాటిని పాటిస్తే కరోనా దరి చేరదు అంటూ చికిత్సలకు సంబంధించిన పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేకున్నా కూడా కొందరు గుడ్డిగా నమ్మేస్తూ ఉన్నారు. అలా గుడ్డిగా నమ్మేసిన వారు ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. ఇలాంటి ఎన్నో వదంతుల్లో నిజం లేదని న్యూస్ మీటర్ ఇప్పటికే చెప్పుకొచ్చింది. తాజాగా మరో వదంతి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.

పాండిచ్చేరి యూనివర్సిటీకి చెందిన ఓ యువకుడు కరోనా మహమ్మారికి విరుగుడు కనుక్కున్నాడని.. అది కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చని చెబుతూ ఉన్నారంటూ పోస్టు వైరల్ అవుతోంది. ప్రపంచం మొత్తం ఈ చిట్కాను అంగీకరించిందంటూ పలువురు పోస్టులను వైరల్ చేయడం మొదలుపెట్టారు.

"* శుభవార్త *

చివరగా పాండిచ్చేరి విశ్వవిద్యాలయానికి చెందిన ఒక భారతీయ విద్యార్థి కోవిడ్ -19 కు సహజ నివారణను కనుగొన్నాడు, ఇది మొదటిసారి WHO చేత అంగీకరించబడింది.

1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు పొడి

2 టేబుల్ స్పూన్ల తేనె మరియు కొంత అల్లం రసమును వరుసగా 5 రోజులు పాలలో కలిపి సేవించడం ద్వారా కరోనా ప్రభావాలను అణిచివేస్తుందని ఆయన నిరూపించారు. చివరికి పూర్తిగా 100% కరోనా ఏ మందులు లేకుండా తగ్గిపోతుంది.

ప్రపంచం మొత్తం ఈ చిట్కాను అంగీకరించడం ప్రారంభించింది.

శుభవార్తను మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు ఈ సమాచారాన్ని సర్క్యులేట్ చేయండి." అంటూ పలువురు ఈ పోస్టును ఫేస్ బుక్, వాట్సాప్ లో వైరల్ చేస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

పాండిచ్చేరి చెందిన విద్యార్థి ఇంట్లోనే కరోనా మహమ్మారిని అంతం చేయడానికి చిట్కా కనుక్కున్నాడంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

ఈ పోస్టులు జులై 2020 నుండే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. పలు ఫ్యాక్ట్ చెకింగ్ పబ్లికేషన్స్ కూడా ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చేశారు. పాండిచ్చేరి యూనివర్సిటీ అధికారులు కూడా ఈ వైరల్ క్లెయిమ్ పై ఎటువంటి ప్రకటన చేయలేదు. పలు మీడియా సంస్థలు.. పాండిచ్చేరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు ఫోన్ చేసి మాట్లాడగా.. ఇందులో ఎటువంటి నిజం లేదని చెప్పారు. తమ స్టూడెంట్ ఎవరూ కూడా ఇలా కొత్త విషయాన్ని కనుగొన్నట్లు తమకు తెలియదని.. ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని అన్నారు.

ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ చిట్కాకు అనుమతి ఇచ్చిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో కూడా నిజం లేదు. పలు మందులను కరోనాను అంతం చేయడానికి ఉపయోగిస్తున్నారు తప్పితే.. ఇలా ఇంట్లో తయారు చేసిన రెమెడీలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇవ్వలేదు.

https://hindi.boomlive.in/fake-news/age-old-home-remedy-peddled-as-covid-19-cure-found-by-indian-student-8971

https://thelogicalindian.com/fact-check/pondicherry-university-covid-19-black-pepper-ginger-honey-22303

ఇదే వార్త హిందీలో కూడా వైరల్ అవ్వగా.. ఆ వార్తను పిఐబి ఫ్యాక్ట్ చెక్ సంస్థ 'ఫేక్ న్యూస్' అంటూ ధృవీకరించింది. ఏప్రిల్ 25, 2021న హిందీ భాషలో వైరల్ అవుతున్న ఇదే చిట్కాను తప్పుడు కథనం అంటూ ట్వీట్ చేసింది.

"One false claim is being claimed in the news that a student of Pondicherry University #COVID19 Have found home remedies for @WHO It has also been approved by #PIBFactCheck Do not share such confusing messages.#कोविड19 Trust only the official sources for the correct information related to."

ఇప్పటి వరకూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ నివారణకు ఎటువంటి హోమ్ రెమెడీని కూడా అప్రూవ్ చేయలేదు.

https://www.who.int/emergencies/diseases/novel-coronavirus-2019/advice-for-public/myth-busters

ఈ వార్తను పలు మీడియా సంస్థలు కూడా ఫేక్ న్యూస్ అంటూ కొట్టి వేశాయి.

https://www.hindustantimes.com/india-news/claims-of-black-pepper-honey-ginger-curing-covid-19-is-fake-tweets-pib-101619427423854.html

https://timesofindia.indiatimes.com/life-style/food-news/black-pepper-honey-and-ginger-are-not-a-remedy-for-covid-19/articleshow/82261349.cms

పాండిచ్చేరి యూనివర్సిటీకి చెందిన విద్యార్థి ఇంట్లోనే కరోనా మహమ్మారిని అంతం చేయడానికి చిట్కా కనుక్కున్నాడంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Claim Review:పాండిచ్చేరి యూనివర్సిటీ విద్యార్థి కరోనా మహమ్మారికి ఇంట్లోనే చికిత్స కనుక్కున్నాడా..?
Claimed By:FaceBook Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook
Claim Fact Check:False
Next Story