దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎంపికయ్యారని ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలిందని చెబుతున్నారు. "జాబితాలో ఒక్క బీజేపీ ముఖ్యమంత్రి కూడా లేరని, కాంగ్రెస్ కూడా లేదని, పినరయి విజయన్ దేశంలోనే అత్యుత్తమ సిఎం అని ఇండియా టుడే సర్వే చెబుతోంది" అని పోస్ట్ లో పేర్కొన్నారు.
నిజ నిర్ధారణ :
"Mood of the Nation Poll" కింద ఇండియా టుడే సర్వేను నిర్వహించింది. దేశంలో రాజకీయ నాయకుల ఫాలోయింగ్ ను అంచనా వేయడానికి ఉద్దేశించిన విస్తృతమైన దేశవ్యాప్త సర్వే. ఇండియా టుడే గ్రూప్‌చే నిర్వహించబడే ద్వై-వార్షిక దేశవ్యాప్త సర్వే. "ఈ సర్వే రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సమాజం, క్రీడలు, సినిమా మరియు విదేశీ వ్యవహారాలపై మారుతున్న జాతీయ కథనాలను వివరిస్తుంది."
సర్వేలో భాగంగా వివిధ ముఖ్యమంత్రుల మూల్యాంకనంపై దృష్టి సారించింది. ఈ సర్వే రెండు విభాగాలుగా విభజించబడింది: 'భారతదేశం అంతటా అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి' మరియు 'హోమ్ స్టేట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి'. ('Most Popular Chief Minister across India' , 'Most Popular Chief Minister in Home State')
https://www.indiatoday.in/mood-of-the-nation/story/motn-survey-modi-on-top-but-challenges-persist-as-bjp-cms-score-low-mamata-rahul-gandhi-kejriwal-1902609-2022-01-21
'భారతదేశం అంతటా అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి' కేటగిరీ కింద, దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచే ముఖ్యమంత్రిగా ఎవరిని భావిస్తున్నారని రేట్ చేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఎం.కె. స్టాలిన్, ఉద్ధవ్ థాకరే, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్ ఉన్నారు.
'హోమ్ స్టేట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి' కేటగిరీ కింద ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉత్తమ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. ఆయన తర్వాత మమతా బెనర్జీ, ఎం.కె. స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, హిమంత బిస్వా శర్మ, భూపేష్ బఘెల్, అశోక్ గెహ్లాట్ ఉన్నారు. పినరయి విజయన్ ఐదో స్థానంలో నిలిచారు.
ఒడిశాకు చెందిన దాదాపు 71% మంది నవీన్ పట్నాయక్ పని తీరుతో సంతృప్తి చెందారని, కేరళ నుండి 61.1% మంది మాత్రమే పినరయి విజయన్ పనితీరుతో సంతృప్తి చెందారని చెప్పారు.
ఇండియా టుడే ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారనే వాదన అబద్ధమని స్పష్టమైంది.