హైదరాబాద్: ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫోటోను షేర్ చేస్తున్న వారు "బార్బర్ జిహాద్"లో పాల్గొన్నారని చెబుతున్నారు.
ఒక ట్విటర్ యూజర్ ఫోటోను షేర్ చేస్తూ "బార్బర్ జిహాద్ లో పాల్గొన్నందుకు డబ్బు అందుతుందని ఒక ముల్లా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దీని ద్వారా, ముస్లిం క్షౌరకులు హిందువులపై HIV- సోకిన బ్లేడ్‌లతో కోత పెడతారు" అని పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చారు.
నిజ నిర్ధారణ :
ప్రముఖ భోజ్‌పురి నటుడు ఇర్ఫాన్ ఖాన్, అతని స్నేహితుడు సంజయ్ యాదవ్‌లను దొంగతనం ఆరోపణలపై ముంబై పోలీసులు అరెస్టు చేసినట్లు ఫోటో చూపినట్లు న్యూస్ మీటర్ కనుగొంది.
కథనం ప్రకారం.. ప్రఖ్యాత భోజ్‌పురి నటుడు ఇర్ఫాన్ ఖాన్, అతని స్నేహితుడు సంజయ్ యాదవ్‌లను బీహార్‌లోని ఛప్రా జిల్లా నుండి ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రెడిట్ కార్డ్‌లు, చెక్కుల పుస్తకాలు, బిల్లు పుస్తకాల ఫ్రాడ్ కు పాల్పడి.. విలువైన వస్తువులను కొనుగోలు చేసిన ఆరోపణలపై అరెస్టు చేశారు.
వారి నుంచి బంగారు ఆభరణాలు, దొంగిలించబడిన 30 క్రెడిట్ కార్డులు, 17 చెక్కుల పుస్తకాలు, ఒక బిల్లు బుక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్ వివేక్ షెండ్యే తెలిపారు.
మేము 18 జూలై 2013న ప్రచురించిన ABP న్యూస్ వీడియో నివేదికను కూడా కనుగొన్నాము. ఇర్ఫాన్ ఖాన్, అతని సహాయకుడిని ముంబై పోలీసులు క్రెడిట్ కార్డ్‌లు, చెక్‌బుక్‌లను దొంగిలించారనే ఆరోపణలపై అరెస్టు చేశారని పేర్కొంది. 30 క్రెడిట్ కార్డులు, 15 చెక్కులు, 2.5 లక్షల నగదు వారి నుండి స్వాధీనం చేసుకున్నారు.
కాబట్టి, HIV-సోకిన బ్లేడ్‌లను ఉపయోగించడం ద్వారా "బార్బర్ జిహాద్" కు పాల్పడుతున్నారంటూ వైరల్ అవుతున్న దావా తప్పు అని మేము నిర్ధారించాము.
- Credits : Md Mahfooz Alam